త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ రానా పోటీ చేస్తారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నవనీత్ పోటీపై ఆమె భర్త రవిరాణా క్లారిటీ ఇచ్చారు. నవనీత్ కు రాజ్యసభ సీటు కేటాయిస్తామని బిజెపి హామీ ఇచ్చిందని చెప్పారు. ప్ర‌స్తుతం బుధేరా నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే గా ఉన్న రవిరాణ తాజాగా మీడియాతో చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి. నవనీత్ రానా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయరని ఆమె రాజ్యసభకు వెళుతుందని మహారాష్ట్ర బిజెపి చీఫ్ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్ తో పాటు ఇతర సీనియర్ నేతలు పలుమార్లు చెప్పారు.


రాజ్యసభ పదవి ఆమెకు సరైంది అని నా అభిప్రాయం అంటూ ఆమె భర్త రవి రాణా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు టాలీవుడ్ లో కొన్ని సినిమాలలో హీరోయిన్గా చేసిన నవనీత్ కౌర్ ..  నట‌సింహం నందమూరి బాలకృష్ణ తో మహారధి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించారు. అనంతరం 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు ఆ గెలుపు వెనక ఎన్సీపీ - కాంగ్రెస్ సహకారం ఉంది. ఇంతకు ఆమె భర్త రవిరాణ ఎవరో కాదు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కు స్వయానా మేనల్లుడు కావడం విశేషం.


ఇక 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన నవనీత్ కౌర్ ఎన్నికలలో కమలం పార్టీ నుంచి అమరావతి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ నేత బలవంత్ వాంకడే చేతిలో ఓటమీ పాలయ్యారు. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆమె బిజెపి నుంచి పోటీ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఆమె భర్త దానిని ఖండించారు. ఇక రవిరాణా బుడ్నేరా నియోజకవర్గ నుంచి 2009 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: