కోల్కతాకు మోడల్, మాజీ మిస్ మోడల్ హేమా శ్రీ భద్ర తో పాటుగా మరో ఇద్దరు మోడల్స్ తన స్నేహితులతో కలిసి దుర్గామాత దర్శనానికి వెళ్లారు.. అయితే అక్కడ అసభ్యకరమైన దుస్తులలో దుర్గామాతను దర్శించుకుంటూ కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారి మండపం వద్ద ఈ ముగ్గురు చేసిన పనికి చాలామంది భక్తులు నేటిజెన్లు సైతం వీరి పైన ఫైర్ అవుతూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా వీరి పైన పలువురు నెటిజన్లు దుర్భాషలాడుతున్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరికి వారికి నచ్చినట్లు దుస్తులు వేసుకొనే హక్కు ఉంటుంది కానీ.. ఆలయాలకు వెళ్లినప్పుడు అందుకు తగ్గట్టుగా సాంప్రదాయమైన దుస్తులు ధరించాలనే కామన్ సెన్స్ వీరికి లేదా అంటూ దేవాలయాల పవిత్రత ఇలాంటి వారి వల్లే నాశనం అవుతోంది అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీలాంటి మోడల్స్ సెలబ్రిటీలే ఇలాంటి దుస్తులు ధరిస్తే ఇక సామాన్యులు సైతం మిమ్మల్ని చూసి ఫాలో అవుతారు అంటూ ఇలాంటివి చేయకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీడికి కౌంటర్ గా మరి కొంతమంది నెటిజన్స్ ఇలా అసభ్యకరంగా బట్టలు ఉన్నాయని చెప్పేవారు శాస్త్రాలపరంగా కూడా దేవుడు అన్ని చోట్ల ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ మరి కొంతమంది నేటిజన్స్ తెలుపుతున్నారు. ఏది ఏమైనా దేవాలయాలు అన్ని చోట్ల కూడా సాంప్రదాయమైన పద్ధతిని అనుసరించాలని ప్రజలు తెలుపుతున్నారు.