రజినీకాంత్ చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ ఆయన స్టైల్ వేరుగా ఉంటుంది.ఎంతోమంది ఆయన స్టైల్ చూసి పడిపోతారు. ఇక కండక్టర్  గా పని చేసే సమయం లోనే రజినీకాంత్ స్టైల్ చూసి చాలా మంది ఆయన బస్సు లో ప్రయాణించే ప్రయాణికులు మీరు చూడడానికి హీరోలా ఉన్నారు. సినిమాల్లో ట్రై చేస్తే కచ్చితంగా హీరో అవుతారు అని పొగిడే వారట. ఇక అందరూ అనుకున్నట్లే రజినీకాంత్ పెద్ద హీరో అయిపోయారు. ప్రస్తుతం ఆయన క్రేజ్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే అలాంటి రజినీకాంత్ ని ఓ హీరోయిన్ నల్లగా ఉన్నాడు..నేను ఆయన తో నటించను అని సినిమా రిజెక్ట్ చేసిందట. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు నదియా.. ఒకప్పుడు హీరోయిన్ గా.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రాణించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. 

ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన అత్తారింటికి దారేది మూవీ లో పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో నదియా నటించి ఇండస్ట్రీ లో చాలా క్రేజ్ సంపాదించింది. అయితే అలాంటి ఈ హీరోయిన్ కి రజినీకాంత్ నటించిన రాజాధి రాజా మూవీలో ఆఫర్ వచ్చిందట. కానీ ఆ ఆఫర్ ని నదియా రిజెక్ట్ చేసిందని రజినీకాంత్ నల్లగా ఉన్నాడు అనే ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది అనే రూమర్ అప్పట్లో గట్టిగా వినిపించింది.

అయితే ఈ రూమర్ పై ఇప్పటివరకు నదియా స్పందించలేదు. ఇక కేవలం రజినీకాంత్ మాత్రమే కాదు విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ తో కూడా చాలా సినిమాల్లో నదియాకి హీరోయిన్ అవకాశాలు వచ్చాయి.కానీ ఒక్క సినిమాలో కూడా నదియా నటించలేదట. కానీ నదియా ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఎందుకు నటించలేదో మాత్రం తెలియదు

మరింత సమాచారం తెలుసుకోండి: