ఇక అలాగే త్వరలోనే శోభితా దూళిపాళ్ల తో ఏడు అడుగులు నడవబోతున్న విషయం తెలిసింది .ఇదే క్రమంలో నాగచైతన్య కెరీర్లో ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించాడు . అయితే వారి అందరిలో ఒక్కే ఒక హీరోయిన్ నాగచైతన్యకు ఎంతో స్పెషల్ .. ఇక కారణం ఏమిటంటే .. చైతన్యకు అమ్మగా , ఫ్రెండ్గా , లవర్ గా కూడా ఆమె నటించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇక్కడ చూద్దాం. ఇంతకీ ఆ హీరోయిన్ వారెవరో కాదు మెగా కోడలు లావణ్య త్రిపాఠి.
నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన మూవీలో నాగార్జునకు భార్యగా నటించింది లావణ్య .. అలాగే ఈ సినిమాకి సిక్వల్ గా వచ్చిన బంగారు రాజు సినిమాలో నాగార్జున కొడుకుగా నాగచైతన్య నటించాడు . అలాగే మనం సినిమాలో కూడా నాగచైతన్య తో లావణ్య ఫ్రెండ్ గా నటించారు. అలాగే యుద్ధం శరణం అనే సినిమాలో కూడా నాగ చైతన్యకు జంటగా ఈమె నటించింది. ఇలా నాగచైతన్య కెరీర్ లోనే హీరోయిన్ లావణ్య త్రిపాఠి అమ్మగా , ఫ్రెండ్ గా , లవర్ గా నటించి మెప్పించింది.