భారతదేశంలో వివిధ భాషల్లో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ రన్ చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ చాలా బాగా హిట్ అయింది. ఈ బిగ్ బాస్ హిందీ షోలో సంచలనాలు క్రియేట్ చేయాలని ఎప్పుడూ భావిస్తుంటారు. అందుకే ఎవరూ ఊహించని పనులు చేస్తుంటారు. తాజాగా ఒక బాబాని బిగ్‌బాస్ స్టేజ్‌పైకి తీసుకొచ్చారు. హిందీ బిగ్ బాస్ దాదాపు అడల్ట్ షో గా మారింది. దానికి ఆ బాబా రావడమే పెద్ద తప్పు చాలా మంది విమర్శిస్తున్నారు.
"బిగ్ బాస్ షోకి నన్ను ఆహ్వానించారు. వాళ్ళు నాకు డబ్బులు ఇస్తామని చెప్పారు కానీ నేను మాత్రం వెళ్లలేదు. నేను పాటిస్తున్న సంప్రదాయాలు, విలువలు ఆ షోకి తగినవి కావు అని నాకు అనిపించింది. అందుకే నేను ఇప్పుడు కాకపోయినా, ఎప్పటికీ ఆ షోకి వెళ్ళను. నాకు విలువలే ముఖ్యం, డబ్బు కాదు." అని ఆ ఆ బాబా ఇటీవల తెలిపాడు.
"బిగ్ బాస్ షోకి వచ్చినందుకు హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఉంటే నన్ను క్షమించాలి. నేను ఆ షోలో పోటీ చేయడానికి వెళ్ళలేదు. నా లక్ష్యం సనాతన ధర్మం గొప్పదనాన్ని ప్రచారం చేయడమే. దయచేసి నన్ను క్షమించండి. కానీ ఇంతే చెప్పాలి - నా చివరి శ్వాస వరకు సనాతన ధర్మం గొప్పదనం గురించి మాట్లాడుతూనే ఉంటాను." ఆ బాబా మరింత వివరణ ఇచ్చాడు.
ఆ బాబా పేరు పూకీ బాబా. అసలు పేరు అనిరుద్ధాచార్య మహారాజ్. ఈయన సల్మాన్ ఖాన్ పోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 18 గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్‌లో కనిపించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. గతంలో ఈయనే బిగ్ బాస్ షోను బాగా క్రిటిసైజ్ చేశాడు ఇప్పుడు ఆయనే అక్కడికి వెళ్లి తన పరువు తీసుకున్నాడు. బిగ్ బాస్ 18లో పోటీ చేసేందుకు తాను ప్రవేశించలేదని, అభ్యర్థులను ఆశీర్వదించేందుకు అతిథిగా వచ్చానని ఆయన అన్నారు. అయినా సరే చాలామంది అతడిని ఏకపారేశారు.