మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర”..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించాడు..సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన దేవర సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ చేత మరోసారి కాలర్ ఎగరేసేలా చేసాడు.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ రాబడుతుంది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం 'దేవర' మూవీ సక్సెస్ తో మంచి ఊపు మీదున్న వున్నారు.దేవర సినిమా గురించి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని, ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయలకు దగ్గరగా వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.మిక్స్డ్ టాక్ తో ఈ స్థాయి వసూళ్లు రావడం అంటే ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ ని ఎన్టీఆర్ పూర్తిగా ఎంజాయ్ చేయకముందే, వార్ 2 సెట్స్ లోకి ఈ నెలాఖరున అడుగుపెట్టబోతున్నాడని సమాచారం.బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరో గా నటిస్తుండగా, ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 14 వ తేదిన గ్రాండ్ గా విడుదల కానుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.. ఈ స్పై సిరీస్ లో ఏక్ తా టైగర్ గా సల్మాన్ ఖాన్ మధ్యలో స్పెషల్ రోల్ ద్వారా కనిపించి వెళ్తుంటాడు. అలా ఒక ఫైట్ సన్నివేశం లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, సల్మాన్ ఖాన్ కనిపిస్తారని లేటెస్ట్ గా బాలీవుడ్ మీడియా లో వినిపిస్తున్న సమాచారం.. ఇదే నిజమైతే వార్ 2 అంచనాలు మరింత పెరిగే అవకాశం వుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: