ఇక నగ్మా - సౌందర్య ఇద్దరు 90 లో సౌత్ ఇండియన్ చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపారు .. అలాగే వీరిద్దరూ విడివిడిగా నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలు కూడా అందుకున్నాయి. అయితే వీరిద్దరూ కలిసి పలు సినిమాలో నటిస్తే మాత్రం అవి డిజాస్టర్ గా మిగిలిపోయింది. అలాంటి సినిమాలలో ముందుగా కే మురళీమోహన్రావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి . సురేష్ బాబు నిర్మించిన సూపర్ పోలీస్ మూవీ 1994లో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని భాషల్లో విడుదలైంది.
అంతేకాకుండా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. వెంకటేష్ నగ్మా - సౌందర్య జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ నగ్మా - సౌందర్య కలిసి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినయర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రిక్షావోడు సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇలా ఒకే ఏడాదిలోనే నగ్మా - సౌందర్య కలిసి నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవటంతో ఆ తర్వాతా నిర్మాతలు ఎవరు ఈ ఇద్దరితో కలిపి సినిమా తీయలేదు. ఈ విధంగా నగ్మా - సౌందర్య కలిసి నటిస్తే సినిమా ప్లాఫ్ అవుద్దని సెంటిమెంట్ గట్టిగా నడిచింది.