ఏదైనా ఫెస్టివల్ వస్తోందంటే చాలు అభిమానులకు ఫుల్ పండుగే.. ముఖ్యంగా తమ అభిమాన హీరోల సినిమాలకు సంబంధించి ఏదైనా అప్డేట్లు సైతం వస్తూ ఉంటాయని ఆనందపడుతూ ఉంటారు. ఈ రోజున దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించి పలు సినిమా అప్డేట్లను విడుదల చేశారు. వాటి గురించి తెలుసుకుందాం.


1). బాలయ్య- బోయపాటి:
BB -4 వర్కింగ్ టైటిల్ తో సినిమాని అనౌన్స్మెంట్ చేస్తూ అక్టోబర్ 16 పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలు కాబోతోంది.


2).సిద్దు జొన్నలగడ్డ-రవి కాంత్ పేరపు:
వీరికి దేశంలో కోహినూరు అనే సినిమాను చేయబోతున్నారు ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారట. రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.


3). విశ్వక్సేన్-రవితేజ ముళ్ళపూడి:
వీరి కాంబినేషన్లో మెకానిక్ రాఖీ సినిమాని తెరకెక్కించారు వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తోంది. ఈరోజున ఈ చిత్రానికి సంబంధించి అమ్మవారితో ఉన్న ఫోటోతో విశ్వక్సేన్ పోస్టర్ని రిలీజ్ చేశారు.


4). అనన్య నాగళ్ళ-సాహిత్ మోత్కూరి :
వీరి కాంబినేషన్లో పొట్టేలు సినిమా రాబోతోంది ఈ సినిమా అక్టోబర్ 25న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా నుంచి అమ్మవారి ఆయుధ పూజలకు సంబంధించి పోస్టర్తో ఒక పోస్టర్ను విడుదల చేశారు.


5). అశోక్ గల్లా-అర్జున్ జంధ్యాల:
వీరి కాంబినేషన్లో దేవకి నందన వాసుదేవ సినిమా రాబోతోంది ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేశారు.

6). అప్సరా రాణి-సురేష్ లంకలపల్లి:
వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం రాచరికం ఈ సినిమా నుంచి దసరా శుభాకాంక్షలు అంటూ అమ్మవారి గెటప్ లో ఉన్న పోస్టర్ని రిలీజ్ చేశారు.

7). లక్కీ భాస్కర్:
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఈ సినిమా ఈనెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

8). మ్యాడ్ స్క్వేర్: కళ్యాణ్ శంకర్
నార్ని నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్ , విష్ణు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా నుంచి ఫన్నీ పోస్టర్ని రిలీజ్ చేశారు.


ఇక వీటితోపాటు మక్కా సినిమా పోస్టర్ని కూడా రిలీజ్ చేస్తూ నవంబర్ 14వ తేదీన విడుదల చేసే విధంగా ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు.. అలాగే తేజ సజ్జ నటిస్తున్న మిరాయి సినిమా కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. నితిన్, శ్రీ లీల  నటిస్తున్న రాబిన్ హుడ్ చిత్రం డిసెంబర్ 20వ తేదీన ఈ ఏడాది రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: