తెలుగు చిత్ర పరిశ్రమకు నందమూరి కుటుంబం నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్.. మ్యాన్ ఆఫ్ మాస్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పవన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే రూ. 500 కోట్ల పైగా కలెక్షన్ అందుకున్న దేవర. ఎన్టీఆర్‌కు బాలీవుడ్ లో కూడా సూపర్ క్రెజ్ తిసుకొచ్చింది.ఇక‌ ఎన్టీఆర్ తో సినిమాల చేయడానికి బాలీవుడ్ హీరోలు కూడా క్యూ కొడుతున్నారు .

అయితే ఎన్టీఆర్ తన కెరీర్ లో చాలా మంది దర్శకుల ని గుడ్డిగా నమ్మేస‌డు .. అది ఎన్టీఆర్ లో ఉన్న పెద్ద మైనస్ అని జనాలు మాట్లాడుకుంటున్నారు . గతంలో ఎన్టీఆర్ ని నిండా ముంచేసిన పలువురు దర్శకల పేర్లను ట్రోల్ చేస్తున్నారు . అలా ముంచిన వారిలో మొదటి స్థానంలో సీనియర్ దర్శకుడు బి గోపాల్ పేరు ముందు గా వినిపిస్తుంది . ఆయన ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా నరసింహుడు . ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ  మూవీ ప్లాప్ నుంచి బయటపడడానికి ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే .

ఆ తర్వాత మెహర్ రమేష్ పేరు గట్టిగా వినిపిస్తుంది . శక్తి సినిమాతో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ను పాతాళానికి తొక్కేశాడు . ఇప్పటికీ శక్తి సినిమా టీవీలో చూసి చీకొట్టే జనాలు ఎంతో మంది ఉన్నారు . ఆ తర్వాత అందరికీ చిరాకు తెప్పించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. దమ్ము సినిమాను ఎన్టీఆర్ తో తెర్కెక్కించిన ఆయన ఖాతాలో పరమ చెత్త రికార్డును వేశాడు. ఈ ముగ్గురు ఇచ్చిన ప్లాప్స్ ఎన్టీఆర్ కి లైఫ్ లో మర్చిపోలేని  షాక్‌లు ఇచ్చాయి. ఈ విధంగా ఈ ముగ్గురు డైరెక్టర్లు ఎన్టీఆర్‌ను నమ్మించి నిండా ముంచేశారు అంటూ ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: