ఒకప్పుడు సినిమాకి ఎ సర్టిఫికెట్ వచ్చిందంటే ఫ్యామిలీ ఆడియన్స్ దాన్ని చూసే ధైర్యం చేసే వాళ్ళు కాదు. అంతేకాదు ఆ సినిమాలను నీలి చిత్రాలతో సమానంగా భావించేవారు. అయితే, తెలుగులో చాలా ఏళ్ల క్రితమే ఒక సినిమా ఎ సర్టిఫికెట్ అందుకుంది. తొలి ఏ సర్టిఫికెట్ అందుకున్న ఆ తెలుగు సినిమా పేరు 'మనుషులు మమతలు'. ఇందులో అక్కినేని నాగేశ్వర రావు, మహానటి సావిత్రి, దివంగత సీఎం జయలలిత, రాజశ్రీ వంటి దిగ్గజ తారాగణం నటించింది.
మంచి ఫ్యామిలీ డ్రామాగా 1965లో విడుదలైన ఈ సినిమా చాలామందికి నచ్చింది. ఫ్యామిలీ డ్రామా అంటున్నారు కదా మరి ఈ చిత్రానికి 1965లోనే ఎ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారనే సందేహం మీకు కలక మానదు. ఇప్పుడు అంటే రొమాంటిక్ సన్నివేశాలు ఉండటం కామన్ అయిపోయింది కానీ అప్పట్లో కొంచెం బోల్డ్ గా, హాట్ సన్నివేశాలు ఉన్నా సరే వాటికి ఏ సర్టిఫికెట్ ఇచ్చేవారు. అలాంటి పాత్రలకు ఒక్క జయలలిత మాత్రమే ఒప్పుకునేవారు. సావిత్రి, జమున మాత్రం ఈ సన్నివేశాలు చేయడానికి ససే మీరా అనేవారు. జయలలిత బాగా గ్లామర్ షో చేస్తుంది కాబట్టే వల్లే ఈ చిత్రానికి ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో ఆమె స్విమ్ సూట్ లో చాలా సెక్సీగా కనిపించారు. అదే ఏఎన్నార్ కు తలనొప్పిగా మారిందట.
సెన్సార్ టీమ్ ఈ సన్నివేశాన్ని చూసి అది ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగిన సినిమా కాదని నిర్ణయించారు. అందుకే దానిని కట్ చేయాలని సూచించారు. కానీ దర్శక నిర్మాతలు ఆ సీన్ కచ్చితంగా సినిమాలో ఉండాల్సిందే అని వారితో వాదించారు. ఫలితంగా సెన్సార్ టీం చేసేదేమీ లేక తప్పని పరిస్థితుల్లో ఎ సర్టిఫికెట్ ఇస్తూ సినిమా రిలీజ్ చేసుకోవచ్చని తెలిపారు. తొలిసారి ఎ సర్టిఫికెట్ అందుకున్న చిత్రం ఏఎన్నార్ దే కావడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే ఆ సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన ఈ మూవీకి చెడు పేరు రాలేదు. అంతేకాదు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. ఈ సినిమా ఏఎన్నార్ కెరీర్ లో చాలా పెద్ద హిట్ అయింది. ఇక దీని తర్వాత అనేక ఎ సర్టిఫికెట్ అందుకున్న చిత్రాలు తెలుగులో వచ్చే అలరించాయి.
ఎన్టీఆర్ సినిమాల్లో తొలిసారి ఎ సర్టిఫికెట్ అందుకున్న మూవీ అగ్గిరవ్వ. 1981లో విడుదలైన ఈ సినిమాలో ఎన్టీఆర్, శ్రీదేవి హీరోయిన్లుగా నటించారు. వయలెన్స్ బాగా ఉండటంవల్ల దీనికి ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.