నార కుటుంబానికి సంబంధించిన వారందరూ కూడా ఈ వేడుకకు రాబోతున్నారు. నార రోహిత్ మొదటిసారి తన సినీ కెరీర్ ని బాణం అనే సినిమాతో మొదలుపెట్టారు. ఆ తర్వాత తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్.. ఎన్నో చిత్రాలలో కామ్ పర్సనాలిటీని మెయింటైన్ చేస్తూ వచ్చారు. తనకంటే తన సినిమాలే ఎక్కువ మాట్లాడితే బాగుంటుందని స్వభావం కలిగిన హీరోగా పేర్కొన్నారు. అందుకే తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ వచ్చారు హీరో నారా రోహిత్.
నారా రోహిత్ నుంచి సినిమా వస్తోందంటే చాలు అందులో ఏదో ఒక మంచి మెసేజ్ ఉంటుందనే విధంగా ప్రేక్షకులకు ముద్ర వేసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కుమారుడు కావడం చేత ఇండస్ట్రీలో బాగానే ఎదిగారు. అయితే ప్రస్తుతం నాలుగు పదుల వయసులో కూడా నారా రోహిత్ హీరోగా నటిస్తూ ఉన్నారు. అయితే ఇటీవలే వెళ్లి విషయం పై నారా రోహిత్ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ప్రతినిధి-2 హీరోయిన్ సిరి గురించి చెప్పినట్లు సమాచారం సిరిని ఆయన కథ కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడట వినిపిస్తోంది. దీంతో మరొక జంట ఇండస్ట్రీలోకి బ్యూటిఫుల్ కపుల్ గా రాబోతున్నారు. మరి రేపటి రోజు వీరి నిచ్చితార్థంతో పెళ్లి తేదీని అఫీషియల్ గా ప్రకటిస్తారేమో చూడాలి.