సహాయం చేయడంలో టాలీవుడ్ ఇండస్ట్రీ దిట్ట.వరద బాధితుల కోసం చిరంజీవి తనవంతుగా కోటి రూపాయలను ప్రకటించారు.. అయితే ఆ డబ్బులను ఇవ్వడానికే చంద్రబాబును కలిసినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫునుంచి మెగాస్టార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారట ఏపీ సీఎం చంద్రబాబు. వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఫైనల్ గా మారుతున్నాయి. చిరంజీవి కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం విరాళాలను ప్రకటించారు. అలాగే రామ్ చరణ్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు తల ఒక కోటి రూపాయలు విరాళం ఇచ్చినట్లు సమాచారం.
చిరంజీవి స్వయంగా చంద్రబాబునాయుడు నివాసానికి వెళ్లి అక్కడ ఈ చెక్కును ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. చిరంజీవి వస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు కూడా ఆయనకే సాధన స్వాగతం పలికినట్లు సమాచారం. కష్ట సమయాలలో అండగా నిలబడిన సినీ సెలబ్రిటీలకు సీఎం చంద్రబాబు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేశారు సెలెబ్రేటీలకు.. మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే.. నిన్నటి రోజున విశ్వంభర చిత్రానికి సంబంధించి టీజర్ కూడా విడుదల చేయగా ఈ టీజర్ పైన కాస్త ట్రోల్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవతార్ సినిమా టైపులో గ్రాఫిక్స్ ఉపయోగించారని.. క్యాజువల్ లుక్లో చిరంజీవి ఎక్కడ కనిపించలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రాన్ని తీస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడినట్లు సమాచారం.