విశ్వంభర టీజర్1:33 నిమిషాల పాటు కొనసాగే ఈ టీజర్ అభిమానులను కాస్త మెప్పించినప్పటికీ ఈ టీజర్ పైన సోషల్ మీడియాలో చాలా దారుణమైన ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి.. ఈ సినిమా విజువల్స్ చూస్తూ ఉంటే రియాలిటీస్స్టిక్కుగా కనిపించడం లేదని.. ఏదో గ్రాఫిక్స్ చేసినట్లుగానే కనిపిస్తోందని ఇందులోని సన్నివేశాలు అవెంజర్స్ సినిమాలో నుంచి కాపీ కొట్టారు అనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇది అంజి-2 సినిమా అంటూ చాలా దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాకుండా చిరంజీవి కూడా ఇందులో ఎక్కువగా మేకప్ ఉపయోగించినట్లుగా చాలా క్లియర్ గా కనిపిస్తున్నది.
మరి ఇందులో చిరంజీవి ఏదైనా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. అయితే కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. చిరంజీవి లుక్ అయితే బాగానే చూపించారు.. కానీ ఇందులోని విజువల్స్ అన్నీ కూడా చిరంజీవి చిత్రాన్ని ట్రోల్ అయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఆదిపురుష్ సినిమా వీటి కంటే బెటర్ అంటూ ఒక వర్గం వారు ఎగతాళి చేస్తున్నారు. ముఖ్యంగా విజువల్ మిస్టేక్స్ సరిచూసుకోండి అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏ మేరకు చిత్ర బృందం అలర్ట్ అయి ఈ విషయం పైన మరింత దృష్టి పెడుతుందో చూడాలి.. దృష్టి పెట్టకపోతే ఈ సినిమా టీజర్ నుంచే నెగటివ్ టాక్ వస్తే ఇక సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి అదే పరిస్థితి కొనసాగుతుంది.