బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు క్రియేట్ చేశాయనే చెప్పాలి.
 
ఈ కాంబోలో నాలుగో సినిమా ఫిక్స్ కావడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ నెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేయడంతో పాటు ఈ సినిమాకు తేజస్విని సైతం ఒక నిర్మాతగా వ్యవహరించడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. తేజస్విని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రొడ్యూసర్ గా బిజీ అవుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
 
బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో మూడు సినిమాలు తెరకెక్కినా ఏ సినిమా కూడా రూ.100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల మార్కును అందుకోలేదు. అఖండ సీక్వెల్ ఆ అంచనాలను అందుకోవడం పక్కా అని ఈ సినిమా ఆ అంచనాలను మించి ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య సినిమాలకు బడ్జెట్ విషయంలో నిర్మాతలు అస్సలు రాజీ పడటం లేదు.
 
శాటిలైట్, ఓటీటీ హక్కుల ద్వారా బాలయ్య సినిమాలు కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్నాయి. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ 2026 సంక్రాంతి టార్గెట్ గా షూట్ జరుపుకుంటోందని తెలుస్తోంది. అనుకున్న విధంగా షూట్ పూర్తైతే మాత్రం ఈ సినిమా ఆ సమయానికే కచ్చితంగా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. బాలయ్య సినిమా సినిమాకు రేంజ్ ను పెంచుకోవడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అవుతున్నారు. బాలయ్య మాస్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద టాప్ అనిపించుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. బోయపాటి శ్రీను పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: