- చివరికి కొమురం భీమ్ గా అద్భుత నటన..
- ఎన్టీఆర్ ను పాన్ ఇండియా హీరోగా నిలబెట్టిన జక్కన్న..
రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగనటువంటి డైరెక్టర్. అలాంటి రాజమౌళి తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసి పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఛీ తెలుగు ఇండస్ట్రీనా అనుకునే స్థాయి నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఒక్కసారైనా నటించాలి అని పెద్ద పెద్ద స్టార్లే అనుకునేంతలా ఇండస్ట్రీని దేశ నలుమూలను దాటించాడు అని చెప్పవచ్చు. అలాంటి రాజమౌళితో ఏ హీరో అయినా సినిమా చేశాడు అంటే అది తప్పక హిట్ అవుతుంది. సినిమా సక్సెస్ అవ్వడమే కాకుండా అందులో నటించిన నటీనటులకు మంచి పేరు వచ్చేలా చేస్తారు. అలా రాజమౌళి ఎంతోమంది హీరోల కెరియర్ ను నిలబెట్టారు అని చెప్పవచ్చు. రాజమౌళి చేతిలో పడి పాన్ ఇండియా స్థాయిలో ఎదిగిన హీరోలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్. వీరిద్దరి కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. అలా వీళ్ళిద్దరి మధ్య దర్శకుడు హీరో అనే సంబంధమే కాకుండా పర్సనల్ గా కూడా మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ విధంగా రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఏంటి అనే వివరాలు చూద్దాం.
రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబో:
శాంతినివాసం అనే సీరియల్ కు డైరెక్షన్ చేస్తున్నటువంటి రాజమౌళికి ఎన్టీఆర్ తో మొదటిసారి సినిమా తీసే అవకాశం వచ్చింది. ఇక రాజమౌళికి సినిమా డైరెక్షన్ అదే మొదటిది. మొదటిసారి ఎన్టీఆర్ ను రాజమౌళి చూశారట. ఆ టైంలో ఆయన బొద్దుగా పొట్టిగా టక్ టక్ అంటూ నడుచుకుంటూ వచ్చారట. ఆయనను చూసినటువంటి రాజమౌళి అబ్బో వీడితో సినిమానా ఓరి దేవుడా అనుకున్నాడట. కరెక్ట్ 10 రోజుల షూటింగ్ తర్వాత ఎన్టీఆర్ నటనా టాలెంట్ చూసి ఆశ్చర్యపోయారట. రాజమౌళికి ఏదైనా సరే అన్ని క్వాలిటీస్ ఉన్న వారితో కాకుండా కామన్ గా ఉన్న వ్యక్తులతో సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాలని ఉంటుంది. అలా కుంటి గుర్రంతో రేసులో గెలిస్తే దానికిక్కే వేరు అనుకోని, హీరో క్వాలిటీస్ లేనటువంటి ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తీసి మొదటి చిత్రమే అద్భుతమైన హిట్ సాధించాడు. ఇక ఈ చిత్రం పాటల పరంగా మరింత సక్సెస్ అయింది.