- రాఘవేంద్రరావు కెరియర్ నిలబెట్టిన సీనియర్ ఎన్టీఆర్..
- 12 చిత్రాలు అన్ని సూపర్ హిట్స్..

 సినిమా ఇండస్ట్రీలో చాలావరకు కొంతమంది దర్శకులు హీరోల మధ్య కాంబినేషన్స్ అనేవి తరచూ రిపీట్ అవుతూ ఉంటాయి. అలా రిపీట్ అయినటువంటి ప్రతి సినిమా హిట్ అవుతూ ఉంటుంది. అలా సీనియర్ ఎన్టీఆర్ తో  రిపీటెడ్ గా సినిమాలు చేసి సక్సెస్ అయినటువంటి డైరెక్టర్ రాఘవేంద్ర రావు. ఎంతో పెద్ద స్టార్ అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్  చిన్న డైరెక్టర్ అయినటువంటి  రాఘవేంద్రరావుకు ఆఫర్ ఇచ్చి  చివరికి సూపర్ హిట్ అందుకున్నాడు. అలా ఇండస్ట్రీలో వీరిద్దరి కాంబినేషన్లో అనేక చిత్రాలు వచ్చాయి. ఇందులో ప్రతి చిత్రం సూపర్ హిట్టే.. మరి రాఘవేంద్రరావు  సీనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ఎన్ని సూపర్ హిట్ అయ్యాయి..ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

 సీనియర్ ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబో:
రాఘవేంద్రరావు తో సినిమా అంటే ఏ హీరో కైనా చాలా ఇష్టం ఉంటుంది. సినిమాల్లో ప్రతి కథలో ఏదో ఒక కొత్తదనం చూపించడంలో రాఘవేంద్రరావు దిట్ట. ఇక పాటల విషయానికి వస్తే రాఘవేంద్రరావు ప్రతి పాటలో ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ ఉంటారు. అలా సినిమాలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా తెరకెక్కించడంలో ఈయనను మించిన వారు లేరని చెప్పవచ్చు. ఆ విధంగా సీనియర్ ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబినేషన్లో దాదాపుగా 12 సినిమాలు తెరకెక్కి అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబోలో ఫస్ట్ టైం తెరకెక్కిన మూవీ అడవి రాముడు. రెండవ సినిమా సింహబలుడు ఇందులో మోహన్ బాబు కైకాల సత్యనారాయణ ముఖ్యపాత్రలో నటించారు. ఇక మూడవ సినిమా కేడి నెంబర్ వన్ ఇందులో ఎన్టీ రామారావు సరసన జయసుధ హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత వచ్చిన సినిమా డ్రైవర్ రాముడు. 


 ఆ తర్వాత వచ్చినటువంటి మరో మూవీ వేటగాడు. ఇందులో ఎన్టీఆర్ కి జోడిగా మొదటిసారి శ్రీదేవి  నటించింది. ఆ తర్వాత వచ్చిన చిత్రం రౌడీ రాముడు కొంటె కృష్ణుడు. ఈ మూవీ తర్వాత గజదొంగ సినిమా వచ్చింది. ఈ చిత్రంలో నీ ఇల్లు బంగారం గానూ అనే సాంగ్ ఇప్పటికి కూడా శ్రోతలను ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. ఇక ఎనిమిదవ సినిమా తిరుగు లేని మనిషి. ఇందులో ఎన్టీఆర్ తో పాటు చిరంజీవి కూడా నటించారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ కలిసి నటించిన మరో చిత్రం సత్యం శివం. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా  కొండవీటి సింహం, ఆ తర్వాత రాఘవేంద్రరావు ఎన్టీఆర్ డైరెక్షన్లో వచ్చినటువంటి మరో మూవీ జస్టిస్ చౌదరి.ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన చిత్రం మేజర్ చంద్రకాంత్.  ఇదే ఎన్టీఆర్ చివరి చిత్రం. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.  ఈ విధంగా అన్న ఎన్టీఆర్ రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: