ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలా స్ట్రాంగ్ గా మారిపోయారో మనం చూస్తూనే ఉన్నాము. మరి ముఖ్యంగా ఒకప్పుడు హీరోయిన్స్ బయటకు వచ్చి ఏది మాట్లాడాలి అన్న భయపడిపోయేవారు . కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు . హీరోయిన్స్ పబ్లిక్ గా బయటకు వచ్చి తమను ఏడిపించిన వారిపై ..అలాగే తమ డెసిషన్ ని నెగిటివ్గా చూసిన వారిపై స్ట్రాంగ్ గా కౌంటర్స్ వేస్తున్నారు . మరి ముఖ్యంగా తమకు నచ్చని అవకాశం ఇచ్చిన హీరోలకు కాల్ చేసి మరి  వాళ్ళు చేసింది తప్పు అనే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చేస్తున్నారు.


అయితే అలాంటి లిస్టులోకే వస్తాడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నితిన్ . మొదటి నుంచి ఎటువంటి సినిమాలను చూస్ చేసుకుంటూ ఉంటాడో మనకు తెలిసిందే. కెరియర్ స్టార్టింగ్ లో మంచి మంచి సినిమాల్లో నటించిన .. ఆ తర్వాత మాత్రం రాంగ్ స్టెప్ వేసి ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో నితిన్ హిట్ కొట్టిందే లేదు. "ఎక్స్ట్రాడినరీ" మ్యాన్ సినిమా పర్లేదు అనిపించిన కానీ నితిన్ కి మాత్రం ఫుల్ ఫిల్ గా సక్సెస్ ఇవ్వలేకపోయింది .



అయితే నితిన్ కెరియర్ లో వన్ ఆఫ్ ద డిజాస్టర్ గా నిలిచిన సినిమా "మాచర్ల నియోజకవర్గం". ఈ సినిమాలో నితిన్ పర్ఫామెన్స్ బాగున్నప్పటికీ సినిమా కధ ఫ్లాప్ అయింది . ఈ సినిమాలో "రారా రెడ్డి" సాంగ్ బాగా హిట్ అయ్యింది. నిజానికి ఈ పాటలో సదాను హీరోయిన్ గా పెట్టాలి  అనుకున్నారట నితిన్.  డైరెక్టర్ చేత కాల్ చేసి అవకాశం కూడా ఇప్పిచ్చారట . కానీ ఒకప్పుడు  హీరోయిన్గా చేసి ఇప్పుడు అదే హీరో పక్కన ఐటెం సాంగ్ లో నటించడానికి సద మనసు అంగీకరించలేదట.  అంతేకాదు సదా..నితిన్ కి కాల్ చేసి మరి ఇంకోసారి ఇలా చేయొద్దు అంటూ వార్న చేసిందట.  అప్పట్లో ఈ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: