* చిరంజీవితో 25 సినిమాలు తీసిన కోదండరామిరెడ్డి  
* చిరంజీవిని మెగాస్టార్ గా మార్చడంలో కీలకపాత్ర
* 90 శాతం సినిమాలు సక్సెస్


 టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో...ఎంతో కష్టపడి చిరంజీవి... మెగాస్టార్ గా ఎదిగారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో రాణించి చాలామందికి ఆదర్శంగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. ఇక మెగాస్టార్ కారణంగా చాలామంది ఇండస్ట్రీలోకి కూడా వస్తున్నారు. అయితే అలాంటి చిరంజీవిని మెగాస్టార్ గా మార్చింది కోదండరామిరెడ్డి అని చెబుతూ ఉంటారు.

 తెలుగు దర్శకుడు కోదండరామిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మెగాస్టార్ చిరంజీవి కే కాకుండా చాలా మంది హీరోలకు లైఫ్ ఇచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని ఓవర్ నైట్ స్టార్ గా మార్చారు కోదండరామిరెడ్డి. కోదండరామిరెడ్డి అలాగే మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఏకంగా 25 సినిమాలు వచ్చాయి. తన కెరీర్లో చిరంజీవి 29 సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ కాలేదు.

కానీ మెగాస్టార్ చిరంజీవి... కోదండరామిరెడ్డి తో సినిమాలు చేయడం ప్రారంభించిన తర్వాత... ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరోగా మారిపోయారు. వీరిద్దరి కాంబినేషన్లో ఏకంగా 25 సినిమాలు రావడం....చాలా గొప్ప విషయం. కోదండరామిరెడ్డి అలాగే మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ముఠామేస్త్రి, అభిలాష,ఖైదీ, చాలెంజ్  లాంటి ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసి...సక్సెస్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా 1983 సంవత్సరంలో ఖైదీ సినిమా..రిలీజ్ కాకా ఆ సినిమా చిరంజీవికి మంచి పేరు తీసుకువచ్చింది.

 అనంతరం... విజేత చాలెంజ్ పసివాడి ప్రాణం అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ సినిమాలు కూడా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. ఇలా ఒక్క దర్శకుడుతో...ఏకంగా 25 సినిమాలు తీసిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి కావడం విశేషం. దీంతో.. ఓవర్ నైట్ స్టార్ మారి చిరంజీవి మెగాస్టార్ గా..చరిత్ర సృష్టించారు. మెగాస్టార్ చిరంజీవి తోనే కాకుండా బాలయ్యతో కూడా కోదండరామిరెడ్డి 18 సినిమాలు తీయడం  గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: