అలా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వార్తలు నిజంగానే నిజమయ్యాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్ సమంత - నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాకనే.. ఆ విషయాన్ని అఫీషియల్ గా ఒప్పుకున్నారు వాళ్లు. అంతేకాదు విరాట్ కోహ్లీ - అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మీడియాలో ఎప్పటినుంచో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఫైనల్లీ దాన్ని నిజం చేశారు విరాట్ - అనుష్క .
అంతేకాదు కొందరు హీరోయిన్స్ గుట్టు రట్టు కూడా చేసింది సోషల్ మీడియా. మరి ముఖ్యంగా టబు అనగానే అందరికీ నాగార్జుననే గుర్తొస్తాడు. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . ఆ వార్తలను విని వినన్నట్టు వదిలేస్తున్నారు నాగార్జున - టబు. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న టబు కేవలం నాగార్జునతోనే కాదు మరొక హీరోతో కూడా ప్రేమాయణం నడిపిందట . ఆయన మరెవరో కాదు "వెంకటేష్". వీళ్ల కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఆ టైంలోనే టబు -వెంకటేష్ ల మధ్య చనువు చూసి అందరికీ వీళ్ళ మధ్య ఏదో యవ్వారం నడుస్తుంది అన్న డౌట్ వచ్చింది. అప్పట్లో వీళ్ళ మధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ కూడా నడిచింది. అయితే టబు పై ఎంత పెద్ద రూమర్స్ వినిపించిన సరే ఆమె ఏ మాత్రం రియాక్ట్ అవ్వదు . తన పని తాను చేసుకుపోతుంది..!!