•మహేష్ కెరియర్నే మార్చేసిన కొరటాల..
•హ్యాట్రిక్ సిద్ధమవుతున్న మహేష్ - కొరటాల కాంబో..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ అంటే అభిమానులకు ఫుల్ పండగే.. ఎందుకంటే వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా పలు రికార్డులను తిరగరాసాయి. ముఖ్యంగా కొరటాల శివ ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక మెసేజ్ ని ఇస్తూ ఉంటారు. అలా కొరటాల శివ - మహేష్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఆ వెంటనే వీరి కాంబినేషన్లో భరత్ అనే నేను సినిమా కూడా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
అందుకే మహేష్ తో సినిమా తీయడానికి కూడా డైరెక్టర్ కొరటాల శివ గత కొన్ని ఏళ్లుగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అందుకోసం ఒక పవర్ఫుల్ స్టోరీని కూడా సిద్ధం చేశారట.. అయితే ఎన్టీఆర్ తో ఆచార్య సినిమా కంటే ముందుగా ఒక సినిమా స్టోరీని వినిపించడంతో ఓకే చెప్పడంతో దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఇందులో మొదటి భాగం గత నెల 27న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఆచార్య సినిమా విడుదల సమయంలో చాలామంది కొరటాల శివని ట్రోల్ చేశారు.
కానీ ఒక ఇంటర్వ్యూలో మాత్రం కొరటాల శివ మాట్లాడుతూ.. మహేష్ గురించి పలు విషయాలను తెలిపారు.. మహేష్ బాబు భరత్ అనే నేను సక్సెస్ సినిమా మీట్ లో తనకు ఎప్పుడు అవకాశాలు లేకపోయినా కచ్చితంగా మహేష్ బాబు ఉంటారనే విషయాన్ని గుర్తు పెట్టుకోమని కొరటాల శివకు తెలియజేశారట. ఈ విషయం తనని చాలా ఆనందాన్ని కలిగించింది అంటూ కొరటాల శివ వెల్లడించారు. ఒక స్టార్ హీరో అయ్యి ఉండి కూడా అవకాశాలు లేనప్పుడు ఖచ్చితంగా తాను ఉంటాను అండగా అని చెప్పడం ఒక గొప్ప విషయమని, అందుకే తనకు మహేష్ బాబుతో సినిమా చేయాలన్నా.. ఆయనన్నా చాలా ఇష్టమని తెలిపారు. ఖచ్చితంగా మా కాంబినేషన్ లో మూడవ సినిమాను హ్యాట్రిక్ కి సిద్ధం చేస్తున్నామంటూ తెలిపారు.