నటరత్న నందమూరి తారకరామారావు నట వారసులలో నందమూరి హరికృష్ణ హీరోగా టాలీవుడ్ లో నటించిన తక్కువ సినిమాల్లో అయినా... తెలుగు తెర‌పై తొలి నటి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా హరికృష్ణ చేసింది తక్కువ సినిమాలే..! అయినా ఆ పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన కెరీర్‌లో చేసింది అతి తక్కువ సినిమాలే అయినా.. ఆ పాత్రలతో టాలీవుడ్ లోనే తనకంటూ ప్రత్యేక పేజీని రాసుకున్నారు. . ఆయ‌న నట ప్రయాణం పదేళ్ల వయసు నుంచే ప్రారంభమైంది. ఇక తండ్రి నటరత్న ఎన్టీఆర్ హీరోగా నటించిన శ్రీకృష్ణ అవతారం సినిమాలో హరికృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.. ఆ తర్వాత ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన తల్లా పెళ్ళామా – తాతమ్మకల సినిమాల్లోనూ బాలనటుడిగా కనిపించారు.


ఆ తర్వాత రామ్ రహీం – దానవీరశూరకర్ణ సినిమాలు చేశారు. ఇక నిజ జీవితంలో అన్నదమ్ములైన హరికృష్ణబాలకృష్ణ, తాతమ్మకల సినిమాలో అన్నదమ్ములుగా కనిపించారు. అందులో బాలకృష్ణ తమ్ముడుగా, హరికృష్ణ అన్నయ్యగా కనిపించారు. ఆ తర్వాత రామ్ రహీం సినిమాలో స్నేహితులుగా కనిపించారు. అప్పటి నుంచి హరికృష్ణ సినిమాలకు దూరమైపోయారు. తన తండ్రి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు పూర్తి స‌మ‌యం ఆయనవెంటే ఉండిపోయారు. తండ్రి అధికారంలో ఉన్న‌ప్పుడు ఏనాడు ఆయ‌న ప‌ద‌వులు తీసుకోలేదు. ఇక తండ్రి ఎన్టీఆర్ మరణం తర్వాత 1996లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే హిందూపురం ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు.


20 ఏళ్ల విరామం తర్వాత నందమూరి కుటుంబం అభిమానిగా ఉన్న వైవిఎస్.చౌదరి దర్శకత్వం వహించిన సీతారామరాజు సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునకు అన్నయ్యగా నటించారు. ఈ సినిమాలో హరికృష్ణనాగార్జున అన్నదమ్ములుగా కనిపించారు. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా  ఎన్ శంకర్ డైర‌క్ష‌న్‌ లో వచ్చిన శ్రీరాములయ్య సినిమాలో కామ్రేడ్ సత్యంగా అతిథి పాత్రలో నటించి అలరించారు. అలా ఈ రెండు సినిమాలు హరికృష్ణకు మంచి పేరు తీసుకురావటమే కాకుండా ఆయనకు వరుస అవకాశాలు వచ్చేలా చేశాయి.



ఆ తర్వాత అదే వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హరికృష్ణ ఉత్తమ నటుడుగా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక తర్వాత మళ్లీ మరోసారి వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో సీతయ్య సినిమాతో టాలీవుడ్ లోనే తిరుగులేని మాస్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు..   20 ఏళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న హరికృష్ణ రీఎంట్రీ ఇచ్చాక ఒక్క వైవిఎస్ చౌదరి దర్శ‌క‌త్వంలోనే ఏకంగా మూడు సినిమాల్లో నటించారు. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అవడంతో పాటు హరికృష్ణను ఐదు పదుల వయసులో తిరుగులేని హీరోగా నిలబెట్టాయి.



అయితే హరికృష్ణకు 50 ఏళ్ల వయసులో అంత గొప్ప స్టార్‌డమ్‌ రావడం వెనక ఆ క్రెడిట్ కచ్చితంగా దర్శకుడు వైవిఎస్ చౌదరికే దక్కుతుంది. సీతయ్య తర్వాత టైగర్ హరిచంద్ర ప్రసాద్ , స్వామి, శ్రావణమాసం సినిమాల్లో కూడా ఆయన నటించి అలరించారు.. ఆ తర్వాత ఆయన మరో సినిమాలో నటించలేదు. ఇక హరికృష్ణ ఇద్దరు కుమారులు ఎన్టీఆర్కళ్యాణ్ రామ్ ఇద్దరూ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు.  ఇప్పుడు హరికృష్ణ మనవడు జానకిరామ్ పెద్ద కొడుకు హీరోగా దర్శకుడు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాత హరికృష్ణకు తిరిగిలేని క్రేజ్ ఇచ్చిన వైవిఎస్ మనవడకు ఎలాంటి క్రేజ్ తీసుకొస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: