సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలు ఎవరికి దక్కుతాయో వారికే మంచి క్రేజీ అవకాశాలు ఉంటాయి. అవి హీరోలకైనా , హీరోయిన్ల కైనా , దర్శకులకైన లేదా ఇతర టెక్నీషియన్ల కైనా లేదా ఇతర నటీనటుల కైనా. ఎవరికి మంచి విజయాలు దక్కుతాయో వారిపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇతర నిర్మాణ సంస్థలు చూపిస్తూ ఉంటాయి. ఇక తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది సంగీత దర్శకులు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ హవా భారీగానే కొనసాగుతుంది. ఓ వైపు దేవి శ్రీ ప్రసాద్ మరో వైపు తమన్ భారీ సినిమాలకు సంగీతం అందిస్తూ వస్తే , చిన్న సినిమాలకు కూడా కొంత మంది సంగీతాన్ని అందిస్తూ వచ్చారు. 

ఇకపోతే దేవి శ్రీ ప్రసాద్ , తమన్ లాంటి వారు పెద్ద సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా కొనసాగారు. ఇక అనిరుద్ రవిచంద్రన్ ప్రస్తుతం అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈయన తమిళ సంగీత దర్శకుడు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం తమిళ సినిమాలకే సంగీతం అందించాడు. కానీ ఇక మెల్లమెల్లగా తెలుగు సినీ పరిశ్రమ వైపు వచ్చేస్తున్నాడు. కొంత కాలం క్రితం అజ్ఞాతవాసి , జెర్సీ సినిమాలకు సంగీతం అందించిన ఈయన తాజాగా బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న దేవర సినిమాకు కూడా సంగీతం అందించాడు. 

అలాగే విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్నానురి కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అలాగే గౌతమ్ తిన్నానురీ దర్శకత్వంలో రూపొందుతున్న మ్యాజిక్ అనే సినిమాకు కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక తాజాగా నాని , శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ కి కూడా సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యాడు. ఇలా అనురుధ్ తెలుగు సినీ పరిశ్రమలోకి భారీ స్థాయిలో దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: