కోలీవుడ్ హీరో విజయ్ కజగం అనే రాజకీయ పార్టీ పెట్టి త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాను అని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ మధ్యనే ఎన్టీఆర్ నటించిన ది గోట్ మూవీ ఓ మోస్తరు కలెక్షన్లను అందుకొని బ్రేక్ ఈవెన్ దాటింది.. ఈ మూవీ దాదాపు 456 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.అయితే ప్రస్తుతం విజయ్ తలపతి హీరోయిన్ పూజ హెగ్డే కాంబినేషన్లో విజయ్ 69వ సినిమా రాబోతుంది. ఈ సినిమాకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీలో బాబీ డియోల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే విజయ్ తన 69వ సినిమా తర్వాత సినిమాలకు దూరంగా ఉంటానని రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. అయితే విజయ్ తమిళ సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళితే కోలీవుడ్ ఇండస్ట్రీ ఏమైపోతుంది.. అని ఎంతోమంది ఆయన అభిమానులు కోలీవుడ్ ఇండస్ట్రీ అయోమయంలో పడిపోయారు. 

కానీ విజయ్ సినిమాలను వదిలేస్తే  నష్టం ఏమీ లేదు విజయ్ సినిమాలు వదిలేసిన ఎవరికి నష్టం జరగదు అంటూ ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఇంతకీ విజయ్ సినిమాల నుండి తప్పుకున్నా నష్టమేమీ లేదు అంటూ వ్యాఖ్యలు చేసింది ఎవరో ఇప్పుడు చూద్దాం.విజయ్ సినిమాల్లో నుండి తప్పకున్నా నష్టం ఏమీ లేదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు తమిళనాడు థియేటర్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినటువంటి తిరువూరు సుబ్రహ్మణ్యం..ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్ సినిమాల నుండి తప్పుకుంటే నష్టం ఏంటి..ఆయన స్థానంలోకి మరో హీరో వస్తారు..

ఇండస్ట్రీలో హీరోలే లేరా..ఆయనను మించి కలెక్షన్లను రాబట్టే హీరోలు వస్తారు.. ఇండస్ట్రీ ఎప్పుడు ఒకే హీరో పై ఆధారపడదు.ఇండస్ట్రీ నుండి ఒక హీరో పోతే మరో హీరో ఆయన స్థానాన్ని సంపాదించుకోవడానికి ఎప్పుడు ముందే ఉంటాడు. ఇండస్ట్రీలో హీరోలకు ఎలాంటి కొదవ లేదు. ఇక్కడ విజయ్ స్థానంలోకి రావడానికి ఎంతో మంది హీరోలు ఉన్నారు. ఆయన సినిమాల నుండి తప్పుకుంటే మాకు పెద్ద నష్టం ఏమి రాదు అంటూ హీరో విజయ్ పై తన అక్కసు వెళ్లగక్కారు తిరువూరు సుబ్రమణ్యం. ప్రస్తుతం ఈయన మాట్లాడిన మాటలపై కొంతమంది విజయ్ అభిమానులు మండిపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: