యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజుల క్రితం దేవర పార్ట్ 1 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించ గా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించ గా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడమ సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. 

ఈ సినిమాకు విడుదల అయిన రోజు మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా ఈ మూవీ భారీ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల అయ్యి ఇది చాలా రోజులవుతున్న ఈ సినిమా మంచి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఇప్పటి వరకు రాబట్టిన కలెక్షన్లకు సంబంధించి ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఈ ప్రకటన ప్రకారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకుగానూ నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇకపోతే జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈ బ్యూటీ తన నటన కంటే కూడా తన అందాలతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: