తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో త్రిష , చిరంజీవి కి జోడిగా నటిస్తూ ఉండగా ... వంశీ , ప్రమోద్ ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను మొదట వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను జనవరి 10 వ తేదీన విడుదల చేయడం లేదు అని వచ్చే సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక నిన్న దసరా పండగ సందర్భంగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం , ఇందులో అద్భుతమైన గ్రాఫిక్స్ సన్నివేశాలు ఉండడంతో ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 20.95 మిలియన్ వ్యూస్ , 248 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే విశ్వంభర మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో ప్రేక్షకుల నుండి అదిరిపోయే సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఇన్ని రోజుల పాటు ఈ సినిమాపై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమా టీజర్ కూడా అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు జనాల్లో మరింత పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: