* ప్రభాస్ రేంజ్ ని అమాంతం పెంచేసిన ఏకైక డైరెక్టర్  

* రాజమౌళితో ప్రభాస్ సినిమా తీస్తే గ్లోబల్ రేంజ్ లో హిట్టు  

* త్వరలో వారు మళ్లీ కలిసి సినిమా చేసే అవకాశం

( ఏపీ - ఇండియా హెరాల్డ్)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి కలిసి ఇప్పటిదాకా  మూడు సినిమాలు చేశారు. అవి ఛత్రపతి, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్. ప్రతి సినిమాలోనూ, రాజమౌళి ప్రభాస్‌ను కొత్త కోణంలో ప్రదర్శించడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా బాహుబలి సినిమా సిరీస్ భారతదేశం మొత్తం ప్రేక్షకులను ఆకట్టుకునే పాన్-ఇండియన్ సినిమాలకు నాంది పలికింది. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇద్దరి కలిసి చేసిన మొదటి సినిమా ఛత్రపతి 2005లో విడుదలైంది. ఈ సినిమాలో ప్రభాస్ చిన్నప్పుడే తన కుటుంబం నుంచి విడిపోతాడు. అతను శివాజి అనే ఒక మంచి పాత్రను చేశాడు. పెద్దయ్యాక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే శక్తిమంతమైన నాయకుడిగా మారుతాడు. ఈ సినిమా ప్రభాస్‌ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా నిలబెట్టింది.

2015 లో, రాజమౌళి, ప్రభాస్ కలిసి బాహుబలి: ది బిగినింగ్ అనే సినిమా చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ మహేంద్ర బాహుబలి అనే వీరుడిగా నటించాడు. తన రాజ్యాన్ని తిరిగి పొందాలని ఆయన ప్రయత్నిస్తాడు. ఈ సినిమా చాలా అద్భుతమైన విజువల్స్, ఒళ్లు గగుర్పొడిపించే యుద్ధాలు, ఆసక్తికరమైన కథతో ప్రేక్షకులను అలరించింది. మన భారతదేశ ప్రజలను మాత్రమే కాకుండా పంచ వ్యాప్తంగా ఎంతో మందికి బాహుబలి ఫేవరెట్ సినిమా అయిపోయింది.

2017లో వచ్చిన బాహుబలి: ది కంక్లూజన్ సినిమా మొదటి భాగం కథకు కొనసాగింపుగా వచ్చింది, కొన్ని రహస్యాలను బయటపెట్టింది. చివరగా, ఒక గొప్ప యుద్ధంతో ఈ సినిమా ముగిసింది. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించడంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత ఆయన వద్దకు అన్ని భారీ బడ్జెట్ సినిమాలే వస్తున్నాయి ఇటీవల కల్పి సినిమాతో ఆయన సూపర్ హిట్ అందుకున్నాడు.

ప్రభాస్, రాజమౌళి మళ్లీ కలిసి సినిమా చేస్తారనే వార్త ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. ఈ రూమర్స్ ఎందుకు వచ్చాయంటే, ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా కల్కి 2898 AD లో రాజమౌళి చిన్న పాత్రలో నటించారు. ఆ సినిమాలో రాజమౌళి ప్రభాస్‌ని ఉద్దేశించి, "నన్ను వదిలేయను, ఇంకా పది సంవత్సరాలు నీతో సినిమాలు చేయాలి" అని జోక్ చేశారు. రాజమౌళి ఇలా చెప్పడంతో ప్రేక్షకులు ఇద్దరు మళ్ళీ కలిసి సినిమా చేస్తారని ఆశతో ఉన్నారు. ప్రభాస్, రాజమౌళి కలిసి చేసిన బాహుబలి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలుసు కదా! అందుకే ఇద్దరు కలిసి మరో సినిమా చేస్తారనే వార్త వినగానే ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: