ముంబైలో ప్రముఖ సినిమా ఫోటోగ్రాఫర్‌గా పాపులర్ అయిన దర్శకుడు తేజ.. రామ్ గోపాల్ వర్మ కు శిష్యుడు. ఆ తర్వాత మెగాఫోన్ పట్టి చిత్రం సినిమాతో డైరెక్టర్ అయ్యారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించిన చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్, రీమాసేన్.. హీరో, హీరోయిన్గా పరిచయం అయ్యారు. కేవలం రూ.37 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రామోజీరావుకి రూ.10 కోట్ల వరకు లాభాలు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత నువ్వు నేను, నిజం, జయం, ధైర్యం, అవునన్నా కాదన్నా, లక్ష్మీ కళ్యాణం, నేనే రాజు నేనే మంత్రి, అహింస లాంటి సినిమాలు తీసి తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరుచుకున్నారు. తేజ సినిమా అంటే కచ్చితంగా ఇండస్ట్రీకి హీరోయిన్‌తో పాటు.. నటీనటులు కొత్తవారు పరిచయం అవుతారని ఇండస్ట్రీ అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూసేది.
తేజ 24 విభాగాలకు చెందిన వారిని ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్‌కు కూడా లైఫ్ ఇచ్చింది తేజ. అయితే అప్పటివరకు ఫ్యామిలీ హీరోయిన్గా పేరున్న రాశిని మాత్రం వ్యాంపుగా మార్చేశాడు. రాశి ఎద అందాలు అందరికీ నచ్చుతాయి. కానీ వాటిని బాగా చూపించిన దర్శకుడు తేజ.. మహేష్ బాబు నిజం సినిమాలో నెగిటివ్ రోల్ అని చెప్పి గోపీచంద్ కీప్‌గర్ల్ రోల్ ఇచ్చాడు. ఆ సినిమాలో రాశిని ఇష్టం వచ్చినట్టు చూపించిపడేశాడు. తీరా సినిమా చూసిన తర్వాత తాను ఈ సినిమా అనవసరంగా ఒప్పుకున్నాను అని చాలా బాధపడింది అట రాశి. ఆ పాత్రలో రాశిని చూసిన టాలీవుడ్ జనాలు మళ్ళీ ఆమెకు ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న పాత్రలు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. అలా నిజం సినిమాలో ఆ పాత్ర రాశి కెరీర్‌పై దెబ్బ కొట్టింది.