తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో గౌతమ్ తిన్ననూరి ఒకరు. ఈయన సుమంత్ హీరోగా రూపొందిన మళ్లీరావా మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా జెర్సీ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈయన క్రేజ్ ఒక్క సారిగా పెరిగింది. 

ఇకపోతే గౌతమ్ కొంత కాలం క్రితం రామ్ చరణ్ తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరి కాంబో మూవీ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఈయన విజయ్ దేవరకొండ తో మూవీ సెట్ చేసుకున్నాడు. ఇక విజయ్ "ది ఫ్యామిలీ స్టార్" సినిమాపై ఫోకస్ పెట్టడంతో వీరి సినిమా కొన్ని రోజులు డిలే అయింది. ఆ గ్యాప్ లో గౌతమ్ మ్యాజిక్ అనే ఒక చిన్న సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కి కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇలా గౌతమ్ , అనిరుద్ కాంబోలో రూపొందిన సినిమా కావడంతో చిన్న సినిమా ఆయన కూడా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇకపోతే ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి అయిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని ఇన్ని రోజుల పాటు మూవీ బృందం ప్రకటించలేదు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయాలి అని మేకర్స్ భావిస్తున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: