మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ క్రేజ్ ఉండేది . వీరిద్దరి కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు ఎన్నో వచ్చాయి . చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమ కు గాడ్ ఫాదర్ అయితే శ్రీదేవి చిత్ర పరిశ్రమ కు అతిలోకసుందరి గా రాణించింది . ఇక ఇద్ద‌రూ కలిసి అదిరిపోయే స్టెప్పులు వేస్తే ఫ్యాన్స్  కు పండుగలా ఉండేది . అయితే గతంలో వీరిద్దరూ కలిసి నటించాల్సిన కొన్ని సినిమాలు కూడా ఆగిపోయాయి. ఆ సినిమాల్లో కనుక వీళ్లు నటించి ఉంటే బాగుండేది.. అనీ ఇప్పటికీ అభిమానులు అంటున్నారు.


అయితే వీరిద్దరి కాంబినేషన్లో గతంలో  మెమొరబుల్ ప్రేమ కథ సినిమా మిస్ అయిందట . ఆ సినిమా ఏంటి ? ఎందుకు ఆ సినిమా మిస్సయింది .. అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం .. ఆ రోజుల్లో అశోక్ కుమార్ దర్శకత్వంలో బ్యూటిఫుల్ లవ్ సినిమా అభినందన .. ఈ సినిమాకు జీ . బాబు కథ ను అందించారు .. ఆత్రేయ‌ అందించిన పాటలు సినిమా కు ప్రాణం పోశాయి . ఇప్పటికీ ఈ సినిమాలో వచ్చే పాటలకు అభిమానులు ఉన్నారు. ఇక ఈ సినిమా కథ రాయటంతో పాటు జీ . బాబు నే నిర్మాతగా కూడా వ్యవహరించారు . అయితే కథ పూర్తయిన తర్వాత ఆయన మొదట చిరంజీవి - శ్రీదేవి తో ఈ సినిమాను చేయాలని భావించారట . అంతేకాకుండా సినిమా కథను శ్రీదేవి కి చెప్పగా ఆమె ఓకే కూడా చెప్పారట.


ఆ తర్వాత చిరంజీవి మేనేజర్ కు కథ చెప్పగా ఆయన ఇది పాత లవ్ స్టోరీ అంటూ రిజెక్ట్ చేశారట. దాంతో ఇదే కథతో అన్వేషణ సినిమా హీరో కార్తీక్ మరియు శోభనను జంటగా పెట్టి సినిమాను తెరకెక్కించారు .. అలా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక చిరంజీవి - శ్రీదేవి జంటగా రావాల్సిన ఈ సినిమా చిరు మేనేజర్ కారణంగా రిజెక్ట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: