తెలుగు స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఆలీ కూడా ఒకరు .. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలో అడుగుపెట్టిన ఆలీ టాలీవుడ్ లోనే అగ్ర కమెడియన్గా ఎదిగారు. ఇక తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే హీరోగా కూడా నటించారు. అలా ఆలీ హీరోగా యమలీల సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా 1994లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే ఈ సినిమాను సీనియర్ ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్టు చేశారు. హీరోగా తొలి సినిమాతోనే ఆలీ తన నటనతో మెప్పించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆలీ హీరోగా కన్నా కమీడియన్ గాని ఎక్కువ సినిమాలో నటిస్తూ బిజీ అయిపోయారు. అయితే ఈ సినిమాలో హీరోగా ఆలీ కన్నా ముందు మరో స్టార్ హీరోతో చేయాలని దర్శకుడు అనుకున్నారట.


అయితే ఆ స్టార్ హీరో వయసు చాలా తక్కువగా ఉండటంతో ఆయన నో చెప్పారట. ఇంతకీ ఆ హీరో ఎవరు అనే విషయాలు ఇక్కడ చూద్దాం. ఆ హీరో మరి ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి ముందుగా ఈ సినిమా కథను మహేష్ తండ్రి కృష్ణకు చెప్పారట. ఇక సమయంలో కృష్ణ ఒకసారి మీరు వచ్చి మా అబ్బాయిని చూడండి అని చెప్పడంతో దర్శకుడు వెళ్లి మహేష్ ని చూసేసరికి  చిన్న వయసులో ఉన్నాడట.. ఆ సమయంలో మహేష్ కి నటన పరంగా ఎలాంటి అనుభవం లేకపోవడంతో.. మీ అబ్బాయి సినిమాల్లోకి రావడానికి కనీసం రెండు సంవత్సరాలు సమయం ప‌ట్టే అవకాశం ఉంది. అప్పుడే మీరు సినిమాల్లోకి తీసుకురావాలని కృష్ణారెడ్డి, కృష్ణకు చెప్పారట.


దాంతో కృష్ణ కూడా కొడుకు మహేష్ ని సినిమాల్లోకి తీసుకురావటం లేదని చెప్పారట. మహేష్ బాబుని వద్దనుకున్న తర్వాత యమలీల సినిమాలో హీరోగా చాలామందిని అనుకున్న నటన పరంగా సరిగా లేకపోవడంత వర్ని రిజర్వ్ చేశారట ఫైనల్ గా ఆలీ నటన బాగుండడంత ఆలిని హీరోగా పెట్టి యమలీలను తెరకెక్కించారు. ఇలా మహేష్ హీరోగా రావాల్సిన ఈ సినిమా ఆలీ హీరోగా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: