సూపర్ స్టార్ రజనీ కాంత్ కొంత కాలం క్రితం జైలర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా రజనీ కాంత్ వెట్టాయన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి జై భీమ్ మూవీ దర్శకుడు అయినటువంటి టీ జే జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను అక్టోబర్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది.

దానితో ఈ మూవీ కి పెద్ద స్థాయిలో కలెక్షన్లు ప్రస్తుతం దక్కడం లేదు. కానీ ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మాత్రం మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకొని ఒక రికార్డును సొంతం చేసుకుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సంవత్సరం ఇప్పటివరకు విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఈ మూవీ మంచి స్థానాన్ని దక్కించుకుంది. కల్కి 2898 AD సినిమా ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను దక్కించుకున్న సినిమాలలో 183.20 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో నిలవగా , ఆ తర్వాత దేవర 150 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో నిలిచింది.

ది గోట్ 104.75 కోట్ల కలెక్షన్లతో 3 వ స్థానంలో నిలిచింది.  "స్త్రీ 2" మూవీ 283.45 కోట్ల కలెక్షన్లతో 4 వ స్థానంలో నిలిచింది. గుంటూరు కారం మూవీ 79.30 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో నిలిచింది. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందిన వెట్టాయన్ మూవీ విడుదల ఆయన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 68.35 కోట్ల కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్లను మొదటి రోజు రాబట్టిన సినిమాల లిస్టులో 6 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: