ఒకవైపు సినిమా పాటలతో బిజీగా ఉన్న మరోవైపు ప్రైవేటు పాటలు కూడా పాడుతూ తన గాత్రానికి మరింత క్రియేటివిటీ జోడించే ప్రయత్నం చేస్తుంది బెంగాలీ టాప్ సింగర్ శ్రేయ ఘోషాల్. తన పాటలకు తానే సాహిత్యం రాసుకొని వాటిని విడుదల చేస్తోంది. తెలుగులో 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో శ్రేయపడిన నువ్వే మాయ చేసావో గాని అనే పాట ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో ... హృదయాలలో అలా నిలిచిపోయింది. ఇక శ్రేయ ఎన్నో అంతర్జాతీయ ఆల్బమ్స్ కూడా చేసింది.. దేశ విదేశాలలో ఆమె ఇచ్చే లైవ్ షోలకు అసలు లెక్కేలేదు. అలాంటి శ్రేయ ఘోషల్ తనకు స్ఫూర్తి ఎవరో తాజాగా చెప్పుకు వచ్చింది .తన వ్యక్తిగత విషయాలు కూడా చెప్పింది.


సంగీతంపై తనకు మక్కువ కలిగింది తన తల్లి శర్మిష్టను చూసే అంటోంది శ్రేయ‌. శర్మిష్ట క్లబ్బుల్లో శాస్త్రీయ బెంగాలీ గీతాలు ఆలపించేవారు.. అలా ఆమె చిన్న వ‌య‌స్సులోనే శ్రేయాను సంగీతం వైపు న‌డిపించారు. అందుకే శ్రేయా నా తొలి గురువు మా అమ్మే. నా తొలి విమర్శకురాలు కూడా తనే. లతామంగేష్కర్‌ను, కేఎస్‌ చిత్రను గాత్రంలో నా గురువులుగా భావిస్తాన‌ని తెలిపారు. అలాగే వైవిధ్యంలో ఆశాభోంశ్లే, గీతా దత్తా, ఘజల్స్‌లో జగ్జీత్‌సింగ్ త‌న‌కు స్ఫూర్తి అని శ్రేయా చెపుతుంటుంది.


ఈ క్ర‌మంలోనే శ్రేయా త‌న ప్రేమ క‌థ గురించి కూడా చెప్పింది. శ్రేయా భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ కెమెరాలకు దూరంగా ఉంటారు. అయితే వీరి ప్రేమ కథసినిమా కథకూ తీసిపోద‌నే చెప్పాలి. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులే కావ‌డం విశేషం. పదేళ్ల సహజీవనం తరువాత 2015లో పెళ్లి చేసుకున్నారు. ‘ఒక స్నేహితుడి వివాహ వేడుకలో ముందుగా తనే నన్ను అడిగాడ‌ని.. త‌నే త‌న ప్రేమ చెప్పాడంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది శ్రేయ. తన భర్తే తన మనసుకు దగ్గరైనవాడని తెలిపింది. 2015లో వీరు మగబిడ్డకు జన్మనిచ్చారు. ముంబయి యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన ముఖోపాధ్యాయ కాలర్‌ ఐడీ, కాల్‌ బ్లాకింగ్‌ యాప్‌ ‘ట్రూకాలర్‌’కు గ్లోబల్ హెడ్ గా ప‌ని చేస్తుండ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: