సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళాలి అంటే ఏ సినిమాల్లో నటించాలి అనే దాని కంటే కూడా ఏ సినిమాలను రిజెక్ట్ చేయాలి అనేది బాగా తెలిసి ఉండాలి. ఎందుకు అంటే హిట్ సినిమాలలో నటించడం కంటే కూడా ఫ్లాప్ సినిమాల్లో నటించినట్లయితే క్రేజ్ భారీగా పడిపోతూ ఉంటుంది. అందుకని ఫ్లాప్ సినిమాలను ముందుగానే పసిగట్టి వాటిని రిజెక్ట్ చేయగలిగితే వారు ఇండస్ట్రీ లో చాలా ఎక్కువ కాలం పాటు మంచి స్థాయి ఉన్న హీరోయిన్లుగా కెరియర్లో కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇందులో రష్మిక మందన చాలా ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.

రష్మిక మందన ప్రస్తుతం తెలుగు , తమిళ ఇండస్ట్రీలలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈమె తన కెరియర్లో చాలా ఫ్లాప్ మూవీలను రిజెక్ట్ చేసింది. రష్మిక రిజెక్ట్ చేసిన కొన్ని ఫ్లాప్ మూవీలా విషయానికి వస్తే ... కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇందులో చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. పూజ హెగ్డే పాత్రలో మొదటి రష్మిక ను అనుకున్నారట.

కానీ ఈమె మాత్రం ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే తలపతి విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. మొదట ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక ను అనుకున్నారట. ఈ సినిమా ఆఫర్ ను రష్మీక రిజెక్ట్ చేసిందట. ఇకపోతే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇలా రష్మిక ఫ్లాప్ మూవీలను ముందే పసి గట్టి వాటిని రిజెక్ట్ చేయడంతో ప్రస్తుతం ఈమె అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది అని చాలా మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: