ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మహేష్ బాబు భార్య నమ్రత పేరు ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం . రీజన్ ఏంటో తెలియదు కానీ ఒకప్పుడు మాత్రం చాలా సైలెంట్ గా ఉండే నమ్రత.. ఈ మధ్యకాలంలో మీడియా ముందుకు ఎక్కువగా వస్తుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎక్కువగా రాక్టివ్ గా ఉంటుంది . మరీ ముఖ్యంగా తన కూతురు సితారను చాలా విషయాలలో హైలైట్ చేస్తుంది. అసలు సితార ని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా దింపే ప్రయత్నం వెనక ఉన్న మెయిన్ క్యారెక్టర్ నమ్రత నే అని అంటూ చాలామంది కూడా చెప్పుకొస్తున్నారు.


అయితే అంతటి క్రేజీ స్థానాన్ని అందుకున్న నమ్రత అసలు ఘట్టమనేని ఇంటికి కోడలు అయ్యుండేదే కాదు అని.. ఆమె తీసుకున్న ఒకే ఒక్క డెసిషన్ ఆమెను ఘట్టమనేని ఇంటికి కోడలుగా రాజ్యం ఏలేసేలా చేసింది అన్న వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. నిజానికి కృష్ణ  కి నమ్రత  ఘట్టమనేని ఇంటికి కోడలు అవ్వడం ఇష్టం లేదు అని .. వీళ్ల పెళ్ళి ఆపడానికి చాలా ట్రై చేశాడని అప్పట్లో చాలా మంది మాట్లాడారు.



కానీ నమ్రత తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఘట్టమనేని కుటుంబాన్ని ఫిదా చేసేసింది. అందుకే ఆమె మహ తెలివైనది అని కూడా అంటుంటారు జనాభ.  నమ్రత పై అంత కోపంగా ఉన్న కృష్ణ కూల్ అయిపోవడానికి కారణం.. పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదు అంటూ మహేష్ బాబు పెట్టిన కండిషన్ కి నిర్మొహమాటంగా నమ్రత యాక్సెప్ట్ చేయడమే.  నమ్రత మహేష్ బాబు కోసం అన్ని వదులుకోవడానికి సిద్ధపడిందట . ఆ డేరింగ్ డెసిషన్ కి ఘట్టమనేని కుటుంబం ఫిదా అయిపోయింది అని కోడలుగా నమ్రతను యాక్సెప్ట్ చేశారట. ప్రజెంట్ నమ్రత -  మహేష్ బాబు బిజినెస్లను అదేవిధంగా సినిమాకి సంబంధించిన వర్క్స్ ను ఒకపక్క గౌతమ్ మరొకపక్క సితార ఫ్యూచర్ ను పక్కగా ప్లాన్ చేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: