సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా రావడమే పెద్ద మ్యాటర్ . దానికి చాలా కష్టం పడాలి . అయితే ఎలాగోలా కష్టాలు పడి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుంటూ స్టార్ గా మారాలి వన్స్ స్టార్ గా మారాక ఆ స్టార్ స్టేటస్ ని కంటిన్యూ చేయాలి . స్టార్ గా మారిపోయాం మనం ఎటువంటి చెత్త సినిమాల్లో వర్క్ చేసిన అభిమానులు మనల్ ని ఎంకరేజ్ చేస్తారు ..హిట్ ఇస్తారు ..అనుకుంటే పొరపాటే . అలాంటి ఓ తప్పు చేసి  విజయ్ దేవరకొండ చాలా చాలా కష్టాలు ఫేస్ చేశాడు .


విజయ్ దేవరకొండ ని అభిమానులు ముద్దుగా ఆటిట్యూడ్ హీరో అంటారు.  మరి కొంతమంది రౌడీ ఫెలో అంటూ కూడా పిలుచుకుంటారు . ఎలా పిలిచిన విజయ్ దేవరకొండకు ఇష్టమే . అయితే విజయ్ దేవరకొండ చాలా పకడ్బందీగా కథలను చూస్ చేసుకుంటారు అని ఫస్ట్ నుంచి అభిమానులు నమ్ముతూ వచ్చారు . పెళ్లిచూపులు - ఎవడే సుబ్రహ్మణ్యం - గీతాగోవిందం లాంటి సూపర్ డూపర్ హిట్స్ ఆయన ఖాతాలో పడ్డాయి అంటేనే ఆయన ఎంత టాలెంటెడ్ అనే విషయం అర్ధం చేసుకోవచ్చు..



అయితే ఎవరూ ఊహించని విధంగా లైగర్ లాంటి ఒక డిఫరెంట్ కంటెంట్ ని ఓకే చేయడం .. ఆ కంటెంట్ కి విజయ్ దేవరకొండ బాడీ సూట్ కాకపోవడం .. ఆయనకు బిగ్ మైనస్ గా మారింది. అంతేకాదు ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది.  లైగర్ ప్రమోషన్స్ లో చాలా దూకుడుగా ప్రవర్తించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత ఇప్పటివరకు హిట్టు కొట్టనేలేదు . ఖుషి సినిమా హిట్ అయిన అదంతా సమంత ఖాతాలోకి పడిపోయింది . ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ . ఒకవేళ లైగర్ సినిమా కాని చేయకుండా ఉంటే నో డౌట్ ఖచ్చితంగా విజయ్ దేవరకొండ - ప్రభాస్ ని మించిపోయేవాడు . బాలీవుడ్ లో ప్రభాస్ తర్వాత అలాంటి స్థానం అందుకుంది విజయ్ దేవరకొండనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: