యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా , హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. అనిరుద్ అందించిన సంగీతం ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. 


సెప్టెంబర్ 27 వ తేదీన భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే 500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలోని పాటలు చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరియు ముఖ్యంగా ఈ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ అయినటువంటి చుట్టమల్లే సాంగ్ ఈ మూవీ విడుదలకు ముందు నుంచే ఫుల్ ట్రెండ్ అయ్యింది. 

ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ , జాన్వి కపూర్ అందాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇకపోతే చుట్టమల్లె సాంగ్ కి ఈ మధ్య కాలంలో అనేక మంది రీల్స్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఓ విదేశీ మహిళ ఈ సాంగ్ కి స్టెప్పులేసింది. ఇక ఇందులో ఈ బ్యూటీ కూడా జాన్వి స్థాయిలో రెచ్చిపోయింది. అద్భుతమైన రీతిలో చుట్టమల్లె సాంగ్ కి విదేశీ మహిళ స్థాయిలో డాన్స్ చేయడంతో దెబ్బకు ఈ వీడియో వైరల్ గా మారింది. ఇకపోతే దేవర మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండాగా అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: