అమల : ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ . ఎలాంటి హిట్స్ అందుకుందో కూడా మనకు తెలిసిందే. కానీ నాగర్జున పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది . కేవలం కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. అడపాదడపా సినిమాల్లో కనిపించినా అవి ట్రెడిషనల్ పాత్రలోనే మెరిసింది.
నమ్రత : ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది. మహేష్ బాబు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది . ఆ తరువాత ఎలాంటి లైఫ్ని అందుకుందో కూడా మనకు బాగా తెలుసు. కోట్ల ఆఫర్ వస్తున్న సరే నమ్రత సినిమాలో మాత్రం నటించను అంటూ తెగేసి చెబుతుంది.
లావణ్య త్రిపాఠి: మెగా ఇంటికోడలుగా అడుగుపెట్టాక ఓ రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. లావణ్య త్రిపాఠి అంతకుముందు ఇండస్ట్రీలో హీరోయిన్ చాలా మంచి పేరు దక్కించుకుంది. ఎప్పుడైతే వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుందో ఆ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్న సినిమాలకు దూరంగా ఉంటుంది . ఒక వెబ్ సిరీస్ లో నటించింది. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే పలు ఆఫర్స్ వస్తున్న ఎక్స్పోజింగ్ చేయాలి అన్న ఉద్దేశంతో వాటిని రిజెక్ట్ చేస్తుంది . అమల - నమ్రత తర్వాత లావణ్య త్రిపాఠి మాత్రమే అలాంటి స్థానాన్ని దక్కించుకుంది..!!