టాలీవుడ్ లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సీనియర్ హీరోయిన్ త్రిష హీరోయిన్ గా టాలీవుడ్ యంగ్ దర్శకుడు వశిష్ట మల్లిcr తెరకెక్కించిన భారీ పాండ్ ఇండియా సినిమా విశ్వంభర. ఇప్పుడు ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాలలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. భోళాశంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి పరువు చాలా వరకు పోయినట్లు అయింది. దీంతో ఇప్పుడు చిరంజీవి చాలా కసితో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అవైటెడ్ టీజర్ ని మేకర్స్ తాజాగా విడుదల చేయగా ... ఈ ఫాంటసీ వండర్ టీజర్ కి మంచి రెస్పాన్స్ తో పాటు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్‌ కూడా వస్తోంది. ఈ సినిమాలో రిలీజ్ అయిన టీజర్ లో భారీ విజువల్స్ తో పాటు వింత‌ వింత జంతువులు కనిపిస్తున్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ వీఎఫ్ ఎక్స్ వర్క్ బాగానే ఉన్నా వీటిలో కొన్ని కంప్లైంట్స్ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి.


స్టార్టింగ్ సీక్వెన్స్ కొన్ని డ్రాగన్స్ లాంటివి చిరు ఎంట్రీలో వెనుక ఉన్నాయి. గాలిలో తేలిపోయే కొండలు, ఓ తెగ అందులో చిన్న పాప వీరి లుక్స్ లో అవతార్ సినిమా షేడ్స్ కనిపిస్తున్నాయని సోష‌ల్ మీడియాలో ఒక్క‌టే చ‌ర్చ న‌డుస్తోంది. దీంతో మీమ్స్ పేజీల్లో ట్రోల్స్ కూడా బాగా న‌డుస్తున్నాయి. ఇక ఆ డ్రాగన్స్ లాంటివి హాలీవుడ్ సినిమాల్లో కూడా చాలా కామన్. అలాగే ఆ చిన్న పాప వారి తెగ సినిమాలో చూస్తుంటే అవ‌తార్ కు దీనికి ఎలాంటి సంబంధం ఉండ‌దు క‌దా... అన్న‌ట్టుగా కూడా తెలుస్తోంది.


అయితే చిరు రెక్కల గుర్రం సీక్వెన్స్ బ్యాక్గ్రౌండ్ ని ఏమన్నా కొత్తగా ట్రై చేయాల్సింది అన్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. మొత్తానికి అయితే గ్రాండ్ విజువల్స్ ని ప్రామిస్ చేసినా కొన్ని సీన్లు గ‌తంలో చూసిన‌ట్టుగా క‌నిపిస్తున్నాయి. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు కొత్త‌గా ట్రై చేసి ఉండాల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి: