అయితే లక్కీ భాస్కర్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ వైరల్ అయిన వార్తల్లో నిజానిజాలేంటో చెప్పకనే చెప్పేశారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఆర్ట్స్ హరికి అత్యంత స్వన్నిహితులలో తాను కూడా ఒకడినని నాగవంశీ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆగిపోవడానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి కారణమని జరుగుతున్న ప్రచారంలో అణువంతైనా నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
వైరల్ అయిన వార్తలు ఎవరో కావాలని ప్రచారం చేసిన వార్తలేనని ఆయన పేర్కొన్నారు. దేవర సినిమా హక్కులు కావాలనే తాను తీసుకున్నానని నాగవంశీ పేర్కొన్నారు. దేవర సినిమా ఎర్లీ మార్నింగ్ షోస్ టాక్ చూసి నాగవంశీకి డబ్బులు పోయినట్టేనని చాలామంది భావించి ఉండవచ్చని ప్రస్తుతం అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యి ఓవర్ ఫ్లొస్ వస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
దేవర సినిమాకు తొలిరోజు భారీ కలెక్షన్లు వచ్చేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని బెనిఫిట్ షోలు రికార్డ్ స్థాయిలో ప్రదర్శించబడటం ఆ సినిమాకు ప్లస్ అయిందని నాగవంశీ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో తనకు క్లోజ్ గా ఉండే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని నాగవంశీ కామెంట్లు చేశారు. దేవర సినిమాకు సంబంధించిన గ్రాస్ కలెక్షన్లు నిజమేనని జిల్లాల వారీగా తీసుకున్నా లక్ష రెండు లక్షలకు మించి తేడా ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చారు. నాగవంశీ చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.