బాధితురాలు కేసును వెనక్కు తీసుకుంటే మాత్రమే జానీ మాస్టర్ కు ఇబ్బందులు తప్పే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. జానీ మాస్టర్ తల్లి తాజాగా గుండెపోటుతో ఆస్పత్రిలో చేరగా జానీ మాస్టర్ భార్య జానీ మాస్టర్ అకౌంట్ నుంచి చేసిన సంచలన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. జానీ మాస్టర్ తల్లి ఆస్పత్రి బెడ్ పై ఉన్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది.
జానీ మాస్టర్ పై కేసు గురించి, నేషనల్ అవార్డ్ గురించి నిజానిజాలు తేలకుండానే ఆరోపణల వెనుక అసలు ఉద్దేశం తెలియకుండానే కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో జానీ మాస్టర్ గురించి ఎవరికి తోచింది వాళ్లు రాస్తూ చూపిస్తూ వినిపిస్తూ ఉండటంతో జానీ మాస్టర్ తల్లి మనస్తాపానికి గురయ్యారని ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగానే ఉందని జానీ మాస్టర్ భార్య చెప్పుకొచ్చారు.
అందరికీ కుటుంబాలు ఉంటాయని ఈ పాపం ఊరికే పోదని సుమలత పోస్ట్ లో పేర్కొన్నారు. సుమలత పోస్ట్ గురించి అటువైపు నుంచి ఏమైనా రియాక్షన్ ఉంటుందేమో చూడాల్సి ఉంది. జానీ మాస్టర్ కు వచ్చిన కష్టం పగోళకు కూడా రాకూడదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జానీ మాస్టర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య తక్కువేం కాదు. ఆయన ఈ కష్టాల నుంచి బయటపడతారో లేదో చూడాల్సి ఉంది.