నిన్నటి రోజున ఎట్టకేలకు అటు నారా రోహిత్ హీరోయిన్ సిరిలెల్ల ఎంగేజ్మెంట్ చాలా సింపుల్గా హైదరాబాద్ నోవ్వాటేల్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఫోటోలు కూడా వైరల్ గా అయ్యాయి. ప్రతినిధి-2 సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ మధ్య ప్రేమ చిగురించడంతో ఈ విషయాన్ని అటు ఇద్దరు కుటుంబ సభ్యులతో చర్చించుకొని మరి పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా నారా రోహిత్ వివాహం చేసుకోబోతున్న ఈ సిరి లెల్ల ఎవరు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయం పైన నారా రోహిత్ అభిమానులు ఆరా తీయగా కొన్ని విషయాలు బయటపడ్డాయి.


సిరిలెల్ల అక్షరాల తెలుగు అమ్మాయేనట.ఈమె ఇక్కడే బ్యాచిలర్ డిగ్రీ ని కూడా పూర్తి చేసిందట.. ఆ తర్వాత పై చదువుల కోసం ఆస్ట్రేలియా కి వెళ్లి అక్కడ మాస్టర్ చేసినట్లు తెలుస్తోంది.. సినిమాల మీద మక్కువ ఉండడంతో తిరిగి మళ్ళీ ఇండియాకి వచ్చేసిందట. అలాంటి సమయంలోనే ఈమెకు ప్రతినిధి-2 సినిమా ఆడిషన్స్ కి వెళ్ళాక అక్కడ లక్కీగా హీరోయిన్గా అవకాశాన్ని అందుకున్నది. ప్రతినిధి-2 సినిమా షూటింగ్ సమయంలో రోహిత్, సిరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడడంతో ఆ బాండింగ్ ప్రేమగా మారిందట.

నారా రోహిత్ పెద్దమ్మ భువనేశ్వర్ కి ఈ విషయం చెప్పడంతో ఆమె స్వయంగా ఈ విషయాన్ని పర్సనల్గా  తీసుకొని మరి.. ఈ అమ్మాయి తరఫున వారితో మాట్లాడి దగ్గరుండి అన్నిటిని కుదిరిచినట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. సిరి కుటుంబ సభ్యులు కూడా పెద్ద కుటుంబం కావడం చేత అందులో నారా కుటుంబం సభ్యుల నుంచి వస్తున్న అల్లుడు కావడం చేత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది . అయితే నారా రోహిత్ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ.. పెళ్లి విషయంతో అటు అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పేశారు.. మరి వివాహమైన తర్వాత ఆయన నారా రోహిత్ కు కలసి వస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: