తెలుగు సినీ ఇండస్ట్రీకి మూల స్తంభం లాంటి వారిలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరిని చెప్పవచ్చు.. క్రమశిక్షణతో నిబద్ధతతో అంచలంచలుగా ఎదుగుతూ తన గ్లామర్ తో, తన టీమ్ ని కూడా ముందుకు నడిపిస్తూ ఫిలిం యాక్టింగ్లో తనకంటూ కొన్ని పేజీలను గుర్తుండిపోయేలా చేసుకున్నారు సీనియర్ ఎన్టీఆర్. తను ఏదైనా పని చేయాలనుకున్నారంటే పట్టుదలతో సాధించేవరకు వదిలిపెట్టే వ్యక్తిత్వం కాదట.. అందుకే సీనియర్ ఎన్టీఆర్ ఎంతోమంది స్ఫూర్తితో సజీవ సాక్ష్యంగా చరిత్రలో నిలిచారు. సీనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో జరిగిన ఒక సంఘటన అందుకు నిరూపణ అన్నట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.


1981లో స్వయంగా తన నిర్మాణంలోని దర్శకత్వంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను తెరకెక్కించి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నదట..అయితే అక్కడ ఊహించని విధంగా సెన్సార్ సభ్యులు ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చారట. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా విడుదల కూడా ఆలస్యం అయిపోయింది. ముఖ్యంగా ఇందులోని కొన్ని సన్నివేశాలను తీసివేయాలంటూ సెన్సార్ బోర్డు సభ్యులు ఆదేశించారట. స్వయంగా ఈ సినిమాని సీనియర్ ఎన్టీఆర్ తెరకెక్కించడంతో ఈయనకి ఇందులోని సన్నివేశాలు అన్నీ కూడా బాగా అవగాహన ఉన్నది.


కానీ సెన్సార్ సభ్యులు కొన్ని సన్నివేశాలు తీసేయాలని అభ్యంతరాలు తెలపడంతో ఏకంగా ఎన్టీఆర్ కోర్టుకే వెళ్లి మరి ఆర్డర్ తెప్పించుకొని సీన్ కటింగ్ లేకుండా తన సినిమాలు విడుదల చేసుకున్నారు. 1984లో ఈ సినిమాలు విడుదల చేశారంటే.. ఆ సమయంలో అంతటి ధైర్యం తెగింపు కేవలం సీనియర్ ఎన్టీఆర్ కే ఉందని చెప్పవచ్చు. 1981లో షూటింగ్ జరుగుతున్న సమయంలో వీరబ్రహ్మేంద్రస్వామి గెటప్లో ఎన్టీఆర్ మేకప్ టెస్ట్ కోసం దిగిన ఫోటోని ఇది అన్నట్టుగా ప్రేమనాథ్ రావు తెలియజేశారు. అయితే ఈ మేకప్ వేయడానికి సుమారుగా గంట వరకు సమయం పట్టేదట.అంతేకాకుండా సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న సమయంలో ఎంతో పని భారం కూడా ఎక్కువైందని తెలిపారు. ఏకంగా ఒక రోజైతే రెండు సినిమాలకి మేకప్ వేసుకొని మరి షూటింగ్ని పూర్తి చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: