సినిమా ఇండస్ట్రీ లో అవకాశాల కోసం కొంత మంది అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. హీరోయిన్గా నటించాలి అనే కోరిక ఉన్నా కూడా అలాంటి అవకాశాలు రాకపోవడంతో వచ్చిన పాత్రలో నటిస్తూ తమ టాలెంట్ ను నిరూపించుకొని ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలను అందిపుచ్చుకున్న వారు ఉన్నారు. ఇక కొంత మంది కి హీరోయిన్గా అవకాశాలు వచ్చిన స్టార్ హీరోల పక్కన ఛాన్సులు రాక కెరియర్ ముగిసిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ కొంత మంది కి మాత్రమే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం తోనే స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు తక్కుతూ ఉంటాయి.

అలాంటి వారికి మొదటి సినిమా విడుదల కాకముందే అద్భుతమైన క్రేజ్ వస్తూ ఉంటుంది. ఇక పైన ఉన్న ఫోటోలో ఒక చిన్న పిల్ల ఉంది కదా ఆమె కూడా అలా మొదటి సినిమాతోనే స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ పాపకు డాన్స్ అంటే చాలా ఇష్టం. దానితో డాన్స్ వైపు ఇంట్రెస్ట్ చూపింది. ఈమెకు సోషల్ మీడియాలో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. ఇక ఈమెకు ఊహించని విధంగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చింది. మరి ఆ స్టార్ హీరో ఎవరు అనుకుంటున్నారా ..? ఆయనే రెబల్ స్టార్ ప్రభాస్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో కొంత కాలం క్రితం ఓ మూవీ స్టార్ట్ అయింది. ఆ సినిమాలో ఇమాన్వి అనే ముద్దుగుమ్మ హీరోయిన్గా ఎంపిక అయింది. 

ఇక ఆ ఫోటోలో ఉన్న చిన్న పాప ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతున్న ఇమన్వి ఇద్దరు ఒకరే. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ కి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎంబీఏ పూర్తి చేసి జాబ్ చేస్తున్న కూడా ఎప్పటికప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండేది. ఇక తన ఇంట్రెస్ట్ ను చూసి ఈమె తండ్రి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మరి ప్రోత్సహించాడట. అందులో ఆమె సక్సెస్ కూడా అయింది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలో హీరోయిన్గా ఎంపిక అయింది. ఈ మూవీ మంచి విజయం సాధిస్తే ఇమాన్ వీకి అద్భుతమైన  గుర్తింపు ఇండియా వ్యాప్తంగా దక్కే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: