ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఈ సంవత్సరం ఇప్పటికే భారీ ఎత్తున వర్షాలు కురిసిన విషయం మన అందరికీ తెలిసిందే . భారీ వర్షాలు క్రమంగా కొరవడం తో పెద్ద ఎత్తైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆస్తి నష్టం , ప్రాణ నష్టం జరిగిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే . రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన నష్టం ముగింపు చర్యలు మొదలు పెట్టారు . అలాగే ఎంతో మంది సెలబ్రిటీలు తమకు తోచి న మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు . ఇక పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు ఎఫెక్ట్ ప్రతి సంవత్సరం కూడా గట్టిగానే ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సంవత్సరం కూడా నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై పడనుంది.

తాజాగా అమరావతి వాతావరణ శాఖ ఒక నివేదికను వెల్లడించింది. దాని ప్రకారం ఉత్తర బంగాళాఖాతం నుంచి క్రమంగా రుతుపవనాలు వైదొలుగుతున్నట్లు తెలుస్తోంది. దానితో వచ్చే రెండ్రోజుల్లో మరింత ఉపసంహరించుకునేలా మారుతున్న పరిస్థితులు. దక్షిణభారతం మీదుగా తూర్పు , ఈశాన్య గాలులు విపరీతంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు , మధ్య బంగాళాఖాతంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రేపటికల్లా దక్షిణ బంగాళాఖాతం లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాగల 48 గంటల్లో ఇది మరింతగా బలపడే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర తమిళనాడు , పుదుచ్చేరి , దక్షిణ ఏపీ తీరాల వైపు ఈ రుతుపవనాలు కదిలే అవకాశం ఉన్నట్లు సమాచారం.- కోస్తాంధ్ర , రాయలసీమలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.- కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురి అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap