యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లతో కలిసి పని చేసినా తారక్ కు లక్కీ ఛార్మ్ ఎవరనే ప్రశ్నకు మాత్రం కాజల్ అగర్వాల్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఈ కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కగా జనతా గ్యారేజ్ లో కాజల్ స్పెషల్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదుర్స్ అనిపించాయి.
 
జూనియర్ ఎన్టీఆర్ కు సక్సెస్ అవసరమైన ప్రతి సందర్భంలో కాజల్ రూపంలో భారీ హిట్ దక్కిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కాజల్ కాంబోలో తెరకెక్కిన బృందావనం మూవీ 2010 దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా కాజల్ అగర్వాల్ భూమి పాత్రకు ప్రాణం పోశారు. బృందావనం సినిమా నిర్మాతలకు కలెక్షన్ల విషయంలో భారీ లాభాలను అందించింది.
 
అయితే బృందావనం తర్వాత తారక్ నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫలితాల విషయంలో నిరాశకు గురి చేశాయి. శక్తి, ఊసరవెల్లి, దమ్ము సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ కాగా బాద్ షా రూపంలో తారక్ కు మరో సక్సెస్ దక్కింది. ఈ సినిమాలో కూడా కాజల్ హీరోయిన్ కాగా ఎన్టీఆర్ కాజల్ కాంబో సీన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాలో కాజల్ కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది.
 
బాద్ షా మూవీ సక్సెస్ సాధించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో టెంపర్ అనే సినిమా తెరకెక్కింది. టెంపర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో స్పెషల్ మూవీ అని చాలామంది భావిస్తారు. దేవర సినిమాతో తారక్ మరో హిట్ అందుకోగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 150 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: