* అల్లు అర్జున్ - కేథరిన్ కాంబో సూపర్‌హిట్టు

* మూడు సినిమాల్లో వారికి కెమిస్ట్రీ అదిరిపోయింది

* కానీ భవిష్యత్తులో వారిని జంటగా చూడగలమా

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఒకే హీరోయిన్ తో కలిసి రెండు మూడు సినిమాలు చేయడం కామన్ అయిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక హీరోయిన్ తో కలిసి ఏకంగా మూడు సినిమాలు చేశాడు. బన్నీతో అన్ని మూవీలు అంటే మాటలు కాదు. ఎందుకంటే ఈ హీరో చాలా క్రేజ్ తెచ్చుకున్నాడు. అతని నుంచి వచ్చే సినిమాలు దాదాపు హిట్ అవుతాయి. అలాంటి మంచి మార్కెట్ ఉన్న బన్నీతో కేథరిన్ థ్రెస్సా మూడుసార్లు కలిసి యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఆమెను టాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు.

కేథరిన్ తొలుత చమ్మక్ చల్లో (2013) తెలుగు సినిమాలో నటించింది. ఈ మూవీ పెద్దగా హిట్ కాలేదు. అందువల్ల ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైనట్లు ఎవరికీ తెలియలేదు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, సంచిత పదుకొనే కూడా నటించారు. దీని తర్వాత ఆమెను అల్లు అర్జున్ తన "ఇద్దరమ్మాయిలతో (2013)" సినిమాలో సెలెక్ట్ చేసుకున్నాడు. ఇదొక రొమాంటిక్ యాక్షన్ ఫిలిం ఇందులో అమలాపాల్ కూడా నటించింది కానీ సైకాలజీ స్టూడెంట్ ఆకాంక్షగా నటించిన కేథరినే బాగా హైలైట్ అయ్యింది. ఆమె స్టైలిష్ లుక్స్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చాలామందికి తెగ నచ్చేసాయి.

అల్లు అర్జున్ కూడా ఆమె అందానికి ఫిదా అయ్యాడట. అందుకే తన సినిమాలో ఏరి కోరి మరీ ఆమెను తీసుకున్నాడు. కేథరిన్ తన గ్లామర్ బాగా ఆరబోస్తూ బన్నీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. దీని తర్వాత మళ్లీ వీరిద్దరూ జంటగా నటించిన సినిమా "రుద్రమదేవి". ఇందులో బన్నీ గోన గన్నారెడ్డిగా నటించాడు. కేథరిన్ బన్నీ లవర్, ఆపై భార్యగా కనిపించింది. ఆమె అన్నాంబికగా నటించింది. ఈ సినిమాలో కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండింది.

2016లో వచ్చిన "సరైనోడు" సినిమాతో మరొకసారి వీరి కాంబినేషన్ రిపీట్ అయింది. ఈ యాక్షన్ ఫిలింలో రకుల్ మెయిన్ హీరోయిన్ కానీ ఎక్కువ మార్కులు కేథరిన్‌కే పడ్డాయి. ఇందులో ఈ అమ్మడు చీరకట్టులో అద్భుతంగా కనిపించింది. బన్నీకి మంచి జోడిగా నిలిచింది. ఈ అందాల తారపై "యు ఆర్ మై ఎమ్మెల్యే" వంటి ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుంది. ఇలా మొత్తంగా వీరు మూడు సినిమాల్లో కలిసి నటించారు. మళ్లీ వీరు భవిష్యత్తులో జోడి కట్టినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. కేథరిన్ బింబిసార సినిమాతో గ్లామర్ గర్ల్ లా మరొకసారి అలరించింది. మరి బన్నీతో ఆమె నటించే అవకాశం ఉంటుందా? ఇప్పుడు పుష్ప సినిమా తర్వాత బన్నీ రేంజ్ బాగా పెరిగిపోయింది. అగ్రతారలు మాత్రమే అతని పక్కన నటించే ఛాన్స్ దక్కించుకుంటున్నారు. కేథరిన్ ఇంకా స్టార్ హీరోయిన్ కాలేక పోయింది కాబట్టి ఆమెను భవిష్యత్తులో బన్నీ పక్కన చూడగలమా అనేది ప్రశ్నార్థకం.

మరింత సమాచారం తెలుసుకోండి: