* నాగార్జున- టబు కాంబోలో 3 సినిమాలు
* నిన్నే పెళ్ళాడుతా తో బంపర్ హిట్ అందుకున్న జంట
* నాగార్జున, టబు  మధ్య రిలేషన్ ఉన్నట్లు వార్తలు
* పెళ్లి చేసుకోబోతున్నారని కూడా.. నాగార్జున టబు పై రూమర్స్



టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు అక్కినేని నాగార్జున.  తన తండ్రికి తగ్గట్టుగానే.. చాలా సినిమాలు చేసి... మంచి సక్సెస్ అందుకున్నాడు నాగార్జున. అంతేకాదు ఏజ్ పైబడినప్పటికీ యంగ్ హీరోలా నిత్యం కనిపిస్తారు. అందుకే టాలీవుడ్  గ్రీకువీరుడు,  మన్మధుడు  అని నాగార్జున ను అని పిలుస్తారు.


అయితే అలాంటి అక్కినేని నాగార్జున... హీరోయిన్ టబు తో చాలా సినిమాలు చేశారు. అక్కినేని నాగార్జున అలాగే టబూ మధ్య.. కెమిస్ట్రీ అదిరిపోతుంది. వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు రాగా మూడు బంపర్ హిట్లు కావడం గమనార్హం. 1996 సంవత్సరంలో నిన్నే పెళ్లాడుతా  వీరిద్దరి కాంబినేషన్లో రెండో మూవీ గా వచ్చింది. ఈ సినిమాలో నాగార్జున అలాగే టబు మధ్య ఉన్న... కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. దీంతో నాగార్జున, టబు మధ్య ఏదో ఉందని కొంతమంది వార్తలు ప్రచారం చేశారు.


ఇప్పటికీ ఆ వార్తలు వస్తూనే ఉన్నాయి.అయితే నిన్నే పెళ్ళాడుతా సినిమా తర్వాత... సిసింద్రీ సినిమా చేశారు.  ఓ చిన్న బాబు కథ కథాంశంతో ఈ సినిమా.. బంపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా 1995లో తీశారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదే మొదటి సినిమా. ఇక 1998లో ఆవిడ మా ఆవిడే అంటూ అక్కినేని నాగార్జున, టబు రచ్చ చేశారు. ఈ సినిమాలో కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది.


అటు సినిమా కూడా బంపర్ హిట్ కావడం జరిగింది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున మరియు టబూ మధ్య  వచ్చినా నిన్నే పెళ్లాడుతా సినిమా.... ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో పాటలు.. సెంటిమెంట్ సీన్స్ కూడా అదిరిపోతాయి. అప్పట్లో ఈ సినిమా ఏకంగా 12 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగలిగిందట. ఆ కాలంలో 12 కోట్లు ఉంటే మామూలు ముచ్చట కాదు. 1000 కోట్లు రాబట్టినట్టే. అంతటి హిట్ అందుకున్నాయి వీరిద్దరి కాంబినేషన్ సినిమాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: