తెలుగులో అత్యంత ప్రజాదారణ పొందిన రియాలిటీ షో లలో బిగ్ బాస్ షో ఒకటి. బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతుంది. తెలుగులో బిగ్ బాస్ బుల్లి తెరపై 7 సీజన్లు విజయవంతంగా కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ కొనసాగుతుంది. బిగ్ బాస్ సీజన్ 1 కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా ... రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇకపోతే మూడవ సీజన్ నుండి అన్ని సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 8 వ సీజన్ ప్రసారం అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇప్పటికే బిగ్ బాస్ 8 వ సీజన్ 6 వారాలు కంప్లీట్ అయింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగి దాదాపు టాప్ 5 లోకి వెళుతుంది అనుకున్న కిరాక్ సీత నిన్నటి ఎపిసోడ్లో ఎలిమినేట్ అయింది. ఈమె ఆరు వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉంది. మరి 6 వారాలకు గాను ఈమె వారానికి ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంది. మొత్తంగా ఈమెకు బిగ్ బాస్ నుండి ఎన్ని డబ్బులు వచ్చే అవకాశం ఉంది అనే వివరాలను తీసుకొని తెలుసుకుందాం. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినందుకు గాను ఒక్కో వారానికి రెండు లక్షల పారితోషకం ఇచ్చే విధంగా బిగ్ బాస్ యూనిట్ తో కిరాక్ సీత తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈమె ఆరు వారాలు హౌసులో కొనసాగింది కాబట్టి వారానికి రెండు లక్షల చొప్పున ఆరు వారాలకు కలిపి 12 లక్షల రూపాయలు సీత బిగ్ బాస్ ద్వారా తీసుకున్నట్లు తెలుస్తుంది. యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత సినిమాల్లో నటించి వాటి ద్వారా కూడా మంచి గుర్తింపు ను సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ ద్వారా ఈమె బుల్లి తెర ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: