ప్రభాస్ అనుష్క పెళ్లి గురించి ఎన్నో వార్తలు జోరుగా ప్రచారంలోకి రాగా ఆ వార్తలు నిజమయ్యే అవకాశాలు అయితే దాదాపుగా లేనట్టేనని చెప్పవచ్చు. ప్రభాస్ అనుష్క కాంబోను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నా ఈ కాంబో సాధ్యం కావడం లేదు. అనుష్క ప్రస్తుతం సెలెక్టివ్ రోల్స్ లో మాత్రమే నటిస్తుండటంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ మాత్రం పాన్ వరల్డ్ స్థాయిలో సత్తా చాటేలా సినిమా ఎంపిక చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రభాస్ సినిమాలు క్రియేట్ చేస్తున్న సంచలనాలు ఫ్యాన్స్ కు సైతం ఊహించని స్థాయిలో ఆనందాన్ని అయితే కలిగిస్తున్నాయి. ప్రభాస్, అనుష్క రెమ్యునరేషన్ పరంగా ప్రస్తుతం ఒకింత టాప్ రేంజ్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.
ప్రభాస్ ఇమేజ్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎన్నో రెట్లు పెరగడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇండస్ట్రీలో మరే స్టార్ హీరోకు సాధ్యం కాని విధంగా ప్రభాస్ ప్లానింగ్ ఉంది. ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా ఆకాశమే హద్దుగా ఎక్కువ మొత్తంగా ఉందని తెలుస్తోంది. ప్రభాస్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లకు ఎక్కువగా ఛాన్స్ ఇస్తూ టాలెంట్ ఉన్న దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే కాగా ఈ సినిమాలు కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించడంతో పాటు సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.