నారా రోహిత్ ఇటీవలే ప్రతినిధి -2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అటు థియేటర్లలోనే కాదు ఇటు ఓటిటిలో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్ గా నటించిన శిరీష లెల్ల తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఇక్కడ ఊహించని విషయం ఏమిటంటే. ఇన్ని రోజులు బ్యాచిలర్ గా లైఫ్ కొనసాగించిన నారా రోహిత్ ఒక్కసారిగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అమ్మాయితో ప్రేమలో పడి నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.
మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయారా..? అప్పుడే పెద్దలను ఒప్పించి ఆలస్యం చేయకుండా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు నారా రోహిత్ చాలా ఫాస్ట్ గా ఉన్నారే అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేశారు. ఇక డిసెంబర్ 15వ తేదీన పెళ్లి జరగబోతోంది అంటూ ఒక వార్త కూడా తెరపైకి వచ్చినా ఇంకా పెళ్లి ముహూర్తం పై నారా కుటుంబం స్పష్టత ఇవ్వలేదు.. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నారా రోహిత్ కాబోయే భార్య ప్రముఖ హీరోయిన్ శిరీష లెల్ల ఎవరు..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..? ఆమె ఎక్కడి నుంచి వచ్చారు..? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
శిరీష లెల్ల సామాన్య రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈమె జన్మస్థలం రెంటచింతల. గురజాల మండలం దైదకు చెందిన నాగేశ్వరరావు 30 ఏళ్ల క్రితం తన గ్రామం విడిచి రెంటచింతలకు వలస వచ్చారు. వ్యవసాయం చేస్తూ కష్టపడి నలుగురు కూతుర్లను ఉన్నత చదువులు చదివించారు. అందరూ బాగా సెటిల్ అయ్యారు. ఇక నాలుగవ అమ్మాయి అయిన శిరీష ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడే కొంతకాలం ఉద్యోగం కూడా చేసి సినీ రంగంపై అభిమానంతో హైదరాబాదులోకి వచ్చి ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది. అలా ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించి తొలి పరిచయంలోని ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించినా.. మరొకవైపు చాలా సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె హీరోయిన్ అవ్వాలనే తన కోరికను రోహిత్ తో తెలియజేసిందట. అందులో భాగంగానే తన ప్రతినిధి 2 సినిమాలో పట్టుబట్టి మరీ ఆమెపై ఉన్న ప్రేమ కారణంగానే అవకాశం ఇప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ఆమె కోరిక కూడా నెరవేర్చి, తన కోరికను కూడా రోహిత్ ఇప్పుడు నెరవేర్చుకోబోతున్నారు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు ఇక ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది.
ఇకపోతే ఈమె తండ్రి బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే.. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే ఈయన చాలా సంవత్సరాల క్రితం మర్డర్ చేసి జీవితకాల శిక్ష కూడా అనుభవించి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దైద నుంచి రెంటచింతలకు వలస వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించిన వీరు ఇప్పుడు హైదరాబాద్ కి షిఫ్ట్ అయినట్లు సమాచారం.